నెగెటివ్ వచ్చినా వదిలిపెట్టేదేలేదు.. ఎవరికైనా సరే ఇవే రూల్స్
దిశ, తెలంగాణ బ్యూరో: విదేశాల నుంచి వస్తున్న ప్రయాణీకులకు ఎయిర్‌పోర్టులో నిర్వహించే టెస్టులో నెగెటివ్వచ్చినా వైద్యశాఖ పూర్తిస్థాయిలో నిఘా పెట్టనుంది. వారిని హోం క్వారంటైన్ చేస్తూ మొదటి టెస్ట్ చేసిన తేదీ నుంచి 8వ రోజుకు మరోసారి ఆర్టీపీసీఆర్పరీక్షను నిర్వహించనున్నారు. పాజిటివ్‌వస్తే సదరు బాధితులను టిమ్స్‌కు తరలించి, ప్రైమరీ కాంటాక్ట్‌లకు టెస్టులు చేసి క్వారంటైన్విధిస్తున్నారు. ఒకవేళ నెగెటివ్ వస్తే ఆ తర్వాత మరో 7 రోజుల పాటు నిర్బంధంలోనే ఉండాలని సూచిస్తున్నారు. ఇలా 14 రోజుల పాటు […]
దిశ, తెలంగాణ బ్యూరో: విదేశాల నుంచి వస్తున్న ప్రయాణీకులకు ఎయిర్‌పోర్టులో నిర్వహించే టెస్టులో నెగెటివ్వచ్చినా వైద్యశాఖ పూర్తిస్థాయిలో నిఘా పెట్టనుంది. వారిని హోం క్వారంటైన్ చేస్తూ మొదటి టెస్ట్ చేసిన తేదీ నుంచి 8వ రోజుకు మరోసారి ఆర్టీపీసీఆర్పరీక్షను నిర్వహించనున్నారు. పాజిటివ్‌వస్తే సదరు బాధితులను టిమ్స్‌కు తరలించి, ప్రైమరీ కాంటాక్ట్‌లకు టెస్టులు చేసి క్వారంటైన్విధిస్తున్నారు. ఒకవేళ నెగెటివ్ వస్తే ఆ తర్వాత మరో 7 రోజుల పాటు నిర్బంధంలోనే ఉండాలని సూచిస్తున్నారు. ఇలా 14 రోజుల పాటు క్షేత్రస్థాయి హెల్త్ కేర్వర్కర్లు పుల్ఫోకస్ పెట్టనున్నారు.
టిమ్స్ లో చికిత్స…
విదేశాల నుంచి వస్తున్న ప్రయాణీకులకు కరోనా పాజిటివ్ అనితేలితే వెంటనే టిమ్స్‌కు తరలించనున్నారు. ఈ మేరకు అక్కడ ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేశారు. ఎట్రిస్క్తో పాటు మరే దేశం నుంచి వచ్చేవారైనా సరే ఇవే నిబంధనలను వర్తింపజేస్తున్నారు. బుధవారం రిస్క్ దేశాల నుంచి హైదరాబాద్‌కు వచ్చిన 325 విదేశీ ప్రయాణికులకు టెస్టులు చేయగా, ఓ మహిళ(35)కు కరోనా పాజిటివ్ గానిర్ధారణ అయిందని డీహెచ్డా జీ శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన గురువారం కోఠి ఆరోగ్యశాఖ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. ఆమె రంగారెడ్డి జిల్లాకు చెందిన మహిళ అని, ప్రస్తుతం ఆమె ఆరోగ్యంగానే ఉన్నారని డీహెచ్ తెలిపారు. ఆమె శాంపిల్‌ను వేరియంట్లను నిర్ధారించే జీనోమ్సీక్వెన్సింగ్ టెస్టుకు పంపామని, మరో రెండు రోజుల్లో ఆ ఫలితం వస్తుందన్నారు. మిగతా వారిని క్వారంటైన్‌చేసి వివరాలను జిల్లా సర్వేలెన్స్ కమిటీకి పంపించామన్నారు. వారు 14 రోజుల పాటు మానిటరింగ్ చేస్తారన్నారు. ఈ మధ్యలో 8వ రోజు వారందరికీ మరోసారి ఆర్టీపీసీఆర్‌ను నిర్వహిస్తామన్నారు.