వాడపల్లి సరిహద్దుల్లో పరిస్థితులపై ఎస్పీ రంగనాథ్ సమీక్ష

దిశ, నల్లగొండ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సరిహద్దు చెక్‌పోస్టు వాడపల్లి వద్ద తాజా పరిస్థితులపై ఎస్పీ ఏవీ రంగనాథ్, మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్ రావుతో కలిసి సమీక్షించారు. సోమవారం సరిహద్దు ప్రాంతానికి వెళ్లి అక్కడి పరిస్థితులపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఆంధ్రా ప్రాంతానికి, ఆ రాష్ట్రం మీదుగా ఇతర ప్రాంతాలకు వెళ్లే వారికి తాము అనుమతులు మంజూరు చేశామని, కానీ ఏపీ పోలీసులు ఎవరినీ అనుమతించడం లేదని ఎస్పీ వెల్లడించారు. తమ పరిధిలో […]

Update: 2020-05-04 04:57 GMT

దిశ, నల్లగొండ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సరిహద్దు చెక్‌పోస్టు వాడపల్లి వద్ద తాజా పరిస్థితులపై ఎస్పీ ఏవీ రంగనాథ్, మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్ రావుతో కలిసి సమీక్షించారు. సోమవారం సరిహద్దు ప్రాంతానికి వెళ్లి అక్కడి పరిస్థితులపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఆంధ్రా ప్రాంతానికి, ఆ రాష్ట్రం మీదుగా ఇతర ప్రాంతాలకు వెళ్లే వారికి తాము అనుమతులు మంజూరు చేశామని, కానీ ఏపీ పోలీసులు ఎవరినీ అనుమతించడం లేదని ఎస్పీ వెల్లడించారు. తమ పరిధిలో ఎలాంటి సమస్యలు ఉన్నా పరిష్కరించడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు. వలస కార్మికులు ఆందోళన చేపట్టకుండా తమకు సహకరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ వెంకటేశ్వర్‌రావు, ఎస్‌బీ డీఎస్పీ రమణారెడ్డి, సీఐ రమేశ్‌బాబు, ఆర్ఐలు ప్రతాప్, స్పర్జన్ రాజ్, నర్సింహాచారి తదితరులు పాల్గొన్నారు.

tags: lockdown, vadapalli checkpost, sp ranganath, review on migrant labour issues

Tags:    

Similar News