ఆలస్యంగా దేశంలోకి ప్రవేశం…

న్యూఢిల్లీ: ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు కాస్త ఆలస్యంగా దేశంలోకి ప్రవేశిస్తున్నట్టు వాతావరణ శాఖ(ఐఎండీ) వెల్లడించింది. వచ్చే నెల 5వ తేదీన కేరళను తాకనున్నట్టు అంచనా వేసింది. సాధారణంగా జూన్ 1వ తేదీన దేశంలోకి నైరుతి ప్రవేశిస్తుంది. గత నెలలో లాంగ్ రేంజ్ ఫోర్‌క్యాస్ట్ అంచనాలను వాతావరణ శాఖ వెల్లడించిన విషయం తెలిసిందే. ఆ అంచనాల్లోనూ జూన్ 1వ తేదీన నైరుతి కేరళలోకి ప్రవేశిస్తుందని తెలిపింది. కానీ, తాజాగా ఈ రుతుపవనాలు ఆలస్యంగా ప్రవేశిస్తాయని పేర్కొంది. రానున్న […]

Update: 2020-05-15 06:11 GMT

న్యూఢిల్లీ: ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు కాస్త ఆలస్యంగా దేశంలోకి ప్రవేశిస్తున్నట్టు వాతావరణ శాఖ(ఐఎండీ) వెల్లడించింది. వచ్చే నెల 5వ తేదీన కేరళను తాకనున్నట్టు అంచనా వేసింది. సాధారణంగా జూన్ 1వ తేదీన దేశంలోకి నైరుతి ప్రవేశిస్తుంది. గత నెలలో లాంగ్ రేంజ్ ఫోర్‌క్యాస్ట్ అంచనాలను వాతావరణ శాఖ వెల్లడించిన విషయం తెలిసిందే. ఆ అంచనాల్లోనూ జూన్ 1వ తేదీన నైరుతి కేరళలోకి ప్రవేశిస్తుందని తెలిపింది. కానీ, తాజాగా ఈ రుతుపవనాలు ఆలస్యంగా ప్రవేశిస్తాయని పేర్కొంది. రానున్న 48 గంటల్లో అండమాన్ దగ్గర తుఫాన్ ఏర్పడే అవకాశముందని, తద్వారా నైరుతి రుతుపవనాలు ఆలస్యమవుతాయని ఐఎండీకి చెందిన డి శివానంద్ పాయ్ వివరించారు.

Tags:    

Similar News