అత్యంత ప్రమాదకర రోడ్లు గల దేశం ఏదో తెలుసా?
న్యూఢిల్లీ: ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన రోడ్లు కలిగిన దేశాల జాబితాలో దక్షిణాఫ్రికా మొదటి స్థానంలో నిలిచింది. సుమారు 56 దేశాలపై అధ్యయనం చేసి అత్యంత ప్రమాదకరమైన రోడ్లు కలిగిన దేశాల జాబితాను అంతర్జాతీయ డ్రైవర్ ఎడ్యుకేషన్ కంపెనీ జుటోబీ తయారు చేసింది. ప్రతి దేశంలో ఐదు అంశాలను ప్రాతిపదికగా తీసుకుని ఈ జాబితాను సిద్దం చేసినట్టు సంస్థ తెలిపింది. ఈ జాబితాలో థాయ్ లాండ్ రెండో స్థానంలో నిలిచింది. ఆశ్చర్యకరంగా అగ్రదేశం యూఎస్ ఈ జాబితాలో మూడో […]
న్యూఢిల్లీ: ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన రోడ్లు కలిగిన దేశాల జాబితాలో దక్షిణాఫ్రికా మొదటి స్థానంలో నిలిచింది. సుమారు 56 దేశాలపై అధ్యయనం చేసి అత్యంత ప్రమాదకరమైన రోడ్లు కలిగిన దేశాల జాబితాను అంతర్జాతీయ డ్రైవర్ ఎడ్యుకేషన్ కంపెనీ జుటోబీ తయారు చేసింది. ప్రతి దేశంలో ఐదు అంశాలను ప్రాతిపదికగా తీసుకుని ఈ జాబితాను సిద్దం చేసినట్టు సంస్థ తెలిపింది.
ఈ జాబితాలో థాయ్ లాండ్ రెండో స్థానంలో నిలిచింది. ఆశ్చర్యకరంగా అగ్రదేశం యూఎస్ ఈ జాబితాలో మూడో స్థానంలో నిలిచింది. ఆ తర్వాత స్థానంలో భారత్ నిలిచింది. ఇక అత్యంత సురక్షితమైన రోడ్లు కలిగిన దేశంగా నార్వేను జుటోబీ అభివర్ణించింది. నార్వే తర్వతా అత్యంత సురక్షితమైన రోడ్లు జపాన్‌లో ఉన్నట్టు జుటోబి తెలిపింది. అందుకే జపాన్‌కు రెండో స్థానాన్ని ఇస్తున్నట్టు చెప్పింది. నార్వే పొరుగు దేశమైన స్వీడన్ మూడో స్థానాన్ని పొందింది. కాగా డబ్ల్యూహెచ్ఓ గ్లోబల్ హెల్త్ అబ్జర్వేటరీ డాటా ప్రకారం ఆయా దేశాల పరిస్థితులను అంచానా వేసి ఈ జాబితాను రూపొందించినట్టు సంస్థ తెలిపింది.