సౌదీ అరేబియా రాజుకు టీకా
రియాద్ : సౌదీ అరేబియా రాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ శుక్రవారం కరోనా టీకా వేసుకున్నారు. దేశ పౌరులకు టీకా అందజేయడానికి ప్రిన్స్ సల్మాన్ తీవ్రంగా కృషి చేస్తున్నారని ఆరోగ్య మంత్రి డాక్టర్ తౌఫిక్ అల్ రబియా పేర్కొన్నారు. కింగ్ సల్మాన్ టీకా వేసుకోవడంపై ప్రశంసలు కురిపించారు. ఫైజర్, బయోఎన్‌టెక్ అభివృద్ధి చేసిన టీకాను సౌదీ అరేబియా ఇదే నెలలో దిగుమతి చేసుకోవడం గమనార్హం. కరోనా టీకా వేసుకున్ని అతికొద్ది మంది అగ్రనేతల్లో సౌదీ అరేబియా కింగ్ […]
రియాద్ : సౌదీ అరేబియా రాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ శుక్రవారం కరోనా టీకా వేసుకున్నారు. దేశ పౌరులకు టీకా అందజేయడానికి ప్రిన్స్ సల్మాన్ తీవ్రంగా కృషి చేస్తున్నారని ఆరోగ్య మంత్రి డాక్టర్ తౌఫిక్ అల్ రబియా పేర్కొన్నారు.
కింగ్ సల్మాన్ టీకా వేసుకోవడంపై ప్రశంసలు కురిపించారు. ఫైజర్, బయోఎన్‌టెక్ అభివృద్ధి చేసిన టీకాను సౌదీ అరేబియా ఇదే నెలలో దిగుమతి చేసుకోవడం గమనార్హం. కరోనా టీకా వేసుకున్ని అతికొద్ది మంది అగ్రనేతల్లో సౌదీ అరేబియా కింగ్ ఒకరిగా నిలిచారు. గతవారం ఇజ్రాయెల్ పీఎం బెంజమిన్ నెతన్యాహు లైవ్ టెలివిజన్‌లో టీకా వేసుకున్నారు. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ కూడా ఇటీవలే కరోనా టీకా వేసుకోవడం గమనార్హం.