రేషన్ బియ్యం పాలీష్ చేస్తున్న గోడౌన్‌పై దాడి

దిశ, ఎల్బీనగర్ : రేషన్ బియ్యాన్ని రహస్యంగా పాలీష్ చేసి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్న ఓ గోడౌన్‌పై ఎస్‌ఓ‌టీ పోలీసులు ఆదివారం దాడులు నిర్వహించారు. 4 క్వింటాళ్ల రేషన్ బియ్యం, 10 క్వింటాళ్ల నూకల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు నిర్వాహకులను అరెస్టు చేసి ఆటోతో పాటు వెయింగ్ మిషన్, 2 సెల్ ఫోన్లు సీజ్ చేశారు. ఆదివారం ఈ మేరకు ఎల్బీనగర్ ఎస్ఓటీ ఇన్స్పెక్టర్ రవీంద్ర కుమార్ వివరాల ప్రకారం.. వన్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని […]

Update: 2020-07-26 11:47 GMT
రేషన్ బియ్యం పాలీష్ చేస్తున్న గోడౌన్‌పై దాడి
  • whatsapp icon

దిశ, ఎల్బీనగర్ : రేషన్ బియ్యాన్ని రహస్యంగా పాలీష్ చేసి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్న ఓ గోడౌన్‌పై ఎస్‌ఓ‌టీ పోలీసులు ఆదివారం దాడులు నిర్వహించారు. 4 క్వింటాళ్ల రేషన్ బియ్యం, 10 క్వింటాళ్ల నూకల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు నిర్వాహకులను అరెస్టు చేసి ఆటోతో పాటు వెయింగ్ మిషన్, 2 సెల్ ఫోన్లు సీజ్ చేశారు. ఆదివారం ఈ మేరకు ఎల్బీనగర్ ఎస్ఓటీ ఇన్స్పెక్టర్ రవీంద్ర కుమార్ వివరాల ప్రకారం.. వన్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని సామనగర్ సర్వే నెం.68లో ఓ డైరీ ఫామ్‌లో రహస్యంగా వనస్థలిపురానికి చెందిన బి. శ్రీనివాస్ (48), సాధనాల రాముడు (44) కలిసి రేషన్ బియ్యాన్ని పాలీష్ చేసి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. పక్కా సమాచారం అందుకున్న పోలీసులు దాడులు నిర్వహించి ఇద్దరు నిర్వాహకులను అరెస్టు చేశారు. ఆటో నం.(ఎపీ టీబీ0071)తో పాటు వెయింగు మిషన్, రెండు సెల్ ఫోన్లు సీజ్ చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News