Sonu Sood :కార్పొరేట్ ఆస్పత్రులకే దొరకనిది.. కామన్ మ్యాన్‌కు దొరుకుతుందా?

దిశ, సినిమా : నటుడు సోను సూద్ సోషల్ మీడియా వేదికగా డాక్టర్లను సింపుల్ క్వశ్చన్ అడిగారు. రెమిడెసివిర్ ఇంజక్షన్ ఎక్కడా దొరకడం లేదని తెలిసినప్పుడు.. ప్రతీ వైద్యుడు ఆ ఇంజెక్షన్‌ను మాత్రమే ఎందుకు సిఫారసు చేస్తున్నారు? ఆస్పత్రులే ఆ మెడిసిన్ పొందలేనప్పుడు సామాన్యుడుకి ఎలా దొరుకుతుంది? అని ప్రశ్నించిన సోను.. దానికి ప్రత్యామ్నాయంగా అందుబాటులో ఉన్న మందును ఉపయోగించి బాధితుల ప్రాణాలు రక్షించవచ్చు కదా అని సందేహం వ్యక్తం చేశారు. ఈ స్టేట్‌మెంట్‌పై ఫాలోవర్స్, ఫ్యాన్స్ […]

Update: 2021-05-19 03:44 GMT

దిశ, సినిమా : నటుడు సోను సూద్ సోషల్ మీడియా వేదికగా డాక్టర్లను సింపుల్ క్వశ్చన్ అడిగారు. రెమిడెసివిర్ ఇంజక్షన్ ఎక్కడా దొరకడం లేదని తెలిసినప్పుడు.. ప్రతీ వైద్యుడు ఆ ఇంజెక్షన్‌ను మాత్రమే ఎందుకు సిఫారసు చేస్తున్నారు? ఆస్పత్రులే ఆ మెడిసిన్ పొందలేనప్పుడు సామాన్యుడుకి ఎలా దొరుకుతుంది? అని ప్రశ్నించిన సోను.. దానికి ప్రత్యామ్నాయంగా అందుబాటులో ఉన్న మందును ఉపయోగించి బాధితుల ప్రాణాలు రక్షించవచ్చు కదా అని సందేహం వ్యక్తం చేశారు. ఈ స్టేట్‌మెంట్‌పై ఫాలోవర్స్, ఫ్యాన్స్ తనకు సపోర్ట్ చేయగా.. కొందరు డాక్టర్లు దీనిపై వివరణ ఇచ్చారు. మీరు చెప్పింది సరైందే కానీ ‘యాంఫోటెరిసిన్ బి’ ప్రభావవంతమైనదే కానీ, కొత్త చికిత్సను అభివృద్ధి చేసేందుకు కొత్త పరిశోధన చేయాల్సి ఉంటుందని చెప్పారు. అయితే ప్రత్యామ్నాయ మందుల కొరత కూడా ఉందని తెలిపిన మరో డాక్టర్.. ఎప్పుడూ ఒకే బ్రాండ్‌కు బదులుగా, ఒకే రసాయన కూర్పుతో ఉన్న కొన్ని పేర్లను సూచించొచ్చని వివరించారు. డిమాండ్ పెరిగి సరఫరా తగ్గినప్పుడు మెడిసిన్ కొరత ఏర్పడుతుందని, తత్ఫలితంగా బ్లాక్ మార్కెటింగ్ జరుగుతుందని వెల్లడించారు.

Tags:    

Similar News