ఆ ఊరి మంచి నీటి కష్టాలు తీర్చిన సోనూసూద్
దిశ, సినిమా: ప్రజల సమస్యలను పరిష్కారానికి కేరాఫ్ అడ్రస్‌లా మారిపోయిన సోనూసూద్ మరో ప్రాబ్లమ్‌కు సొల్యూషన్ చూపించారు. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ గ్రామంలో నీటి సమస్యను పరిష్కరించారు. ఝాన్సీ గ్రామస్తులు కొందరు సోషల్ మీడియా ద్వారా తమ విలేజ్‌లో నెలకొన్న తాగునీటి సమస్య గురించి వివరించారు. మంచి నీటి కోసం మైళ్ల దూరం నడవాల్సి వస్తోందని, మహిళలు, పిల్లలు చాలా కష్టాలు పడుతున్నారని తెలిపారు. ఈ సమస్య విని చలించిపోయిన సోనూ సూద్.. పది రోజుల్లోనే చేతి […]
దిశ, సినిమా: ప్రజల సమస్యలను పరిష్కారానికి కేరాఫ్ అడ్రస్‌లా మారిపోయిన సోనూసూద్ మరో ప్రాబ్లమ్‌కు సొల్యూషన్ చూపించారు. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ గ్రామంలో నీటి సమస్యను పరిష్కరించారు. ఝాన్సీ గ్రామస్తులు కొందరు సోషల్ మీడియా ద్వారా తమ విలేజ్‌లో నెలకొన్న తాగునీటి సమస్య గురించి వివరించారు. మంచి నీటి కోసం మైళ్ల దూరం నడవాల్సి వస్తోందని, మహిళలు, పిల్లలు చాలా కష్టాలు పడుతున్నారని తెలిపారు. ఈ సమస్య విని చలించిపోయిన సోనూ సూద్.. పది రోజుల్లోనే చేతి పంపులు ఏర్పాటు చేయించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో షేర్ చేసిన సోను.. ఇక నుంచి నీటిసమస్య ఉండదని, ఎవరొచ్చినా తాగునీరు దొరుకుతుందని తెలిపారు.
पानी की कमी अब से खत्म।
आपके गांव में कुछ हैंडपंप लगवा रहा हूं ।
कभी आया तो पानी ज़रूर पिला देना। 🇮🇳@SoodFoundation https://t.co/bFqVjjcSO9 pic.twitter.com/6aRLnObPZ7— sonu sood (@SonuSood) February 25, 2021