మోడీకి సోనియాగాంధీ 5 సూచనలు

న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోడీ విజ్ఞప్తిపై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ స్పందించారు. కరోనాపై పోరాటానికి ఆమె 5 సూచనలు చేస్తూ మోడీకి లేఖ రాశారు. ప్రధాని సహా ఎంపీల వేతనాలు 30 శాతం కోత విధిస్తూ క్యాబినెట్ నిర్ణయం తీసుకున్న తర్వాతి రోజే సోనియాగాంధీ ‘ఐదు పటిష్టమైన సూచనలు’ చేశారు. ఢిల్లీలో 20 వేల కోట్లతో తలపెడుతున్న సుందరీకరణ ప్రాజెక్టును నిలిపేయాలని సోనియా గాంధీ సూచించారు. ఇప్పుడున్న చారిత్రక భవనంలో పార్లమెంటు సజావుగా సాగుతుందని […]

Update: 2020-04-07 07:24 GMT

న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోడీ విజ్ఞప్తిపై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ స్పందించారు. కరోనాపై పోరాటానికి ఆమె 5 సూచనలు చేస్తూ మోడీకి లేఖ రాశారు. ప్రధాని సహా ఎంపీల వేతనాలు 30 శాతం కోత విధిస్తూ క్యాబినెట్ నిర్ణయం తీసుకున్న తర్వాతి రోజే సోనియాగాంధీ ‘ఐదు పటిష్టమైన సూచనలు’ చేశారు.

ఢిల్లీలో 20 వేల కోట్లతో తలపెడుతున్న సుందరీకరణ ప్రాజెక్టును నిలిపేయాలని సోనియా గాంధీ సూచించారు. ఇప్పుడున్న చారిత్రక భవనంలో పార్లమెంటు సజావుగా సాగుతుందని భావిస్తూ.. రీ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ను ఉపసంహరించుకోవాలని తెలిపారు. ఆ డబ్బును కరోనా మహమ్మారిపై పోరాటానికి వినియోగించుకోవాలని సూచించారు. కొత్త పార్లమెంటు భవనానికి బదులు కొత్త హాస్పిటల్స్, ల్యాబ్స్ నిర్మించాలని కోరారు. ఎంపీల వేతనాల్లో 30 శాతం కోతను పరోక్షంగా ఉటంకిస్తూ.. ప్రభుత్వం తన సొంత ఖర్చుల్లో 30 శాతం కోత పెట్టుకోవాలని సూచించారు. ఆ మొత్తంతో వలస కార్మికులు అసంఘటిత రంగ కార్మికులకు సహాయ పడాలని విజ్ఞప్తి చేశారు. ప్రధాని, క్యాబినెట్ మంత్రుల విదేశీ పర్యటనలను రద్దు చేసుకోవాలని పేర్కొన్నారు.

కరోనా వైరస్ సంబంధిత ప్రకటనలు మినహా టీవీలు.. ప్రింట్ పేపర్లకు ఇతర యాడ్స్ ను రెండేళ్లపాటు నిలిపేయాలని సూచించారు. పీఎం కేర్స్ లోని సొమ్మును పీఎం రిలీఫ్ ఫండ్ కు బదిలీ చేయాలని తెలిపారు. రెండు నిధులను మెయింటెన్ చేయాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు. అలాగే సీఎం రిలీఫ్ ఫండ్ లోని 3,800 కోట్లు వినియోగించకుండా మూలకు పడి ఉన్నాయని తెలిపారు. తాను చేసిన సూచనలతో పొదుపైన సొమ్మును కరోనా పై పోరాటానికి వినియోగించవలసిందిగా పేర్కొన్నారు.

Tags: Coronavirus, india, suggestions, modi, sonja gandhi, cut, fund

Tags:    

Similar News