గుంటూరు జిల్లాలో కలకలం

దిశ, వెబ్ డెస్క్: గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలో నేడు ఉదయం కలకలం చెలరేగింది. పట్టణంలోని 39వ వార్డులో కౌన్సిలర్‌గా టీడీపీ నేత మంచాల రమేశ్ కుమార్తె పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రమేశ్‌తో పాటు ఆయన సోదరుడిపై కొందరు కత్తులతో దాడికి పాల్పడ్డారు. ఐతానగర్‌లోని ఆయన ఇంటికి వచ్చిన ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఆయనను బయటకు పిలిచారు. అనంతరం దాడికి పాల్పడగా, వారిని అడ్డుకునేందుకు రమేశ్‌‌ సోదరుడు సతీశ్ ప్రయత్నించారు. దీంతో ఆయన‌ మెడపై […]

Update: 2020-06-24 22:45 GMT
గుంటూరు జిల్లాలో కలకలం
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్: గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలో నేడు ఉదయం కలకలం చెలరేగింది. పట్టణంలోని 39వ వార్డులో కౌన్సిలర్‌గా టీడీపీ నేత మంచాల రమేశ్ కుమార్తె పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రమేశ్‌తో పాటు ఆయన సోదరుడిపై కొందరు కత్తులతో దాడికి పాల్పడ్డారు. ఐతానగర్‌లోని ఆయన ఇంటికి వచ్చిన ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఆయనను బయటకు పిలిచారు. అనంతరం దాడికి పాల్పడగా, వారిని అడ్డుకునేందుకు రమేశ్‌‌ సోదరుడు సతీశ్ ప్రయత్నించారు. దీంతో ఆయన‌ మెడపై గుర్తు తెలియని వ్యక్తులు కత్తితో దాడి చేశారు. వారిపై జరిగిన హత్యాయత్నంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News