అధికారులమంటూ హల్ చల్.. వీఆర్ఓకు ఫోన్

దిశ, కోదాడ: సూర్యాపేట జిల్లా మునగాల మండలం నేలమర్రి గ్రామంలో ప్రభుత్వ అధికారులమంటూ ముగ్గురు వ్యక్తులు సోమవారం హల్ చల్ చేశారు. వివరాళ్లోకి వెళితే… గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం దళితులకు మూడెకరాల భూమిని కేటాయించగా, కొద్ది రోజులుగా వారి మధ్య వివాదం చోటు చేసుకుంది. దీన్ని ఆసరాగా చేసుకొని ముగ్గురు వ్యక్తులు కొన్ని బోర్డులు తీసుకొని గ్రామానికి చేరుకున్నారు. వీఆర్‌ఏ నాగేశ్వరరావుకు ఫోన్ చేసి భూమి వద్దకు రావాలని చెప్పారు. దీంతో నాగేశ్వరరావు గ్రామానికి చెందిన ఇంచార్జ్ వీఆర్ఓ […]

Update: 2020-07-27 07:08 GMT

దిశ, కోదాడ: సూర్యాపేట జిల్లా మునగాల మండలం నేలమర్రి గ్రామంలో ప్రభుత్వ అధికారులమంటూ ముగ్గురు వ్యక్తులు సోమవారం హల్ చల్ చేశారు. వివరాళ్లోకి వెళితే… గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం దళితులకు మూడెకరాల భూమిని కేటాయించగా, కొద్ది రోజులుగా వారి మధ్య వివాదం చోటు చేసుకుంది. దీన్ని ఆసరాగా చేసుకొని ముగ్గురు వ్యక్తులు కొన్ని బోర్డులు తీసుకొని గ్రామానికి చేరుకున్నారు. వీఆర్‌ఏ నాగేశ్వరరావుకు ఫోన్ చేసి భూమి వద్దకు రావాలని చెప్పారు. దీంతో నాగేశ్వరరావు గ్రామానికి చెందిన ఇంచార్జ్ వీఆర్ఓ వెంకన్నకు సమాచారం ఇచ్చారు. ఈ లోపే ఆ ముగ్గురు వ్యక్తులు దళితులకు కేటాయించిన భూముల వద్దకు చేరుకొని బోర్డులు పాతే ప్రయత్నాలు చేశారు. దీంతో అక్కడకు చేరుకున్న దళితులు వారిని ఐడీ కార్డు చూపించాలని కోరారు. దీంతో సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయారు. ఈ విషయమై వీఆర్ఏ, వీఆర్వోలను సంప్రదించగా తమకు ఫోన్ చేసి సదరు వ్యక్తులు కలెక్టరేట్ నుంచి వస్తున్నాము అని చెప్పడంతో ఇక్కడకు వచ్చామని అన్నారు. అంతే గానీ తమకు ఏమీ తెలియదని చెప్పారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లగా విచారణ చేపట్టి, సదరు డూప్లీకేట్ అధికారులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Tags:    

Similar News