డియర్ అభిజిత్ ఫ్యాన్స్.. మెహబూబ్ అలా చెప్పలేదు

దిశ, వెబ్‌డెస్క్: బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 ముగిసింది. అభిజిత్ విన్నర్‌గా నిలిచినా.. నిజమైన విన్నర్ సోహెల్ అన్నట్లుగానే ఉంది. రూ.25 లక్షలతో బయటకు రావడం.. ఆనాథ ఆశ్రమానికి రూ.5 లక్షలు.. స్నేహితుడు మెహబూబ్‌కు రూ.5 లక్షలు ఇస్తానని చెప్పడంతో నాగార్జున, చిరంజీవి సైతం ముచ్చటపడగా.. అభిమానులు ఫిదా అయిపోయారు. అయితే మెహబూబ్ సంజ్ఞల వల్లే సోహెల్ రూ.25లక్షలు తీసుకున్నాడని.. తను థర్డ్ ప్లేస్‌లో ఉన్నాడని చూపించడం వల్లే బెనిఫిట్స్ పొంది.. విన్నర్‌కు అన్యాయం చేశారని […]

Update: 2020-12-23 03:16 GMT

దిశ, వెబ్‌డెస్క్: బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 ముగిసింది. అభిజిత్ విన్నర్‌గా నిలిచినా.. నిజమైన విన్నర్ సోహెల్ అన్నట్లుగానే ఉంది. రూ.25 లక్షలతో బయటకు రావడం.. ఆనాథ ఆశ్రమానికి రూ.5 లక్షలు.. స్నేహితుడు మెహబూబ్‌కు రూ.5 లక్షలు ఇస్తానని చెప్పడంతో నాగార్జున, చిరంజీవి సైతం ముచ్చటపడగా.. అభిమానులు ఫిదా అయిపోయారు. అయితే మెహబూబ్ సంజ్ఞల వల్లే సోహెల్ రూ.25లక్షలు తీసుకున్నాడని.. తను థర్డ్ ప్లేస్‌లో ఉన్నాడని చూపించడం వల్లే బెనిఫిట్స్ పొంది.. విన్నర్‌కు అన్యాయం చేశారని అభిజిత్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఎంతో కష్టపడి బిగ్ బాస్ విజేతగా నిలిచిన అభిజిత్.. వీడియో స్కాం వల్ల కేవలం రూ.25 లక్షలతో ఇంటికి వెళ్లాల్సి వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో అభిజిత్ ఫాలోవర్స్‌కు సోహెల్ ఫ్యాన్స్ రీకౌంటర్ ఇస్తుండటంతో సోషల్ మీడియాలో రచ్చ రచ్చ అవుతుంది. దీంతో ఇదంతా అబ్జర్వ్ చేసిన సోహెల్ వార్‌కు ముంగిపు పలికేందుకు లైవ్‌లో క్లారిటీ ఇచ్చాడు.

మెహబూబ్ ఏదో హింట్ ఇచ్చాడని.. అందుకే తాను డబ్బులు తీసుకున్నానని వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని సోహెల్ స్పష్టం చేశాడు. తన పదేళ్ల కెరీర్‌పై ఒట్టేసి చెబుతున్నానని, తనను నమ్మాలని కోరాడు. ఇలాంటి ఫ్యాన్ వార్‌లు వద్దని.. అభిజిత్ గెలుపుతో అందరం ఆనందంగా ఉన్నామని, తనకు కూడా నాకు మంచి స్నేహితుడని చెప్పాడు. తాము ఇద్దరం బాగున్నప్పుడు ఫ్యాన్స్, ఫాలోవర్స్ ఇలా కొట్టుకోవడం నచ్చడం లేదన్నాడు. ఫ్యాన్స్‌ను ఫ్రెండ్స్‌లా భావిస్తున్నానని.. ఒక ఫ్రెండ్‌గా చెప్పింది వినాలని అభ్యర్థించాడు. పాజిటివిటీని స్ప్రెడ్ చేసేందుకు ట్రై చేద్దామని.. ఇకనైనా ఈ వార్ ఆపాలని విన్నవించాడు.

కనీసం అభిజిత్ చెప్తే అయినా ఫ్యాన్స్ వింటారేమోనన్న ఆశతో తనతో కూడా చెప్పించాడు సోహెల్. అభిజిత్ లైవ్ షోలో ఉండగా తనతో మాట్లాడిన సోహెల్ అభిమానులకు విజ్ఞప్తి చేయించాడు. మేమందరం కలిసి పార్టీలు చేసుకుంటామని.. అలాంటప్పుడు మీరెందుకు కొట్టుకోవాలని ప్రశ్నించాడు. మేము మేము బాగానే ఉన్నప్పుడు మీరు కూడా బాగుండాలనేదే నా కోరిక అని చెప్పాడు. అభిజిత్‌తో కూడా అదే విషయం చెప్పించి ఫ్యాన్ వార్‌కు ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశాడు.

Tags:    

Similar News

Sharvari

Ishita Raj Sharma