వైద్యం పేరుతో యువతిపై అత్యాచారం
దిశ, వెబ్‌డెస్క్ : వైద్యం కోసం వచ్చిన మహిళా సాఫ్ట్వేర్ ఇంజినీర్‌ను ఓ కీచక డాక్టర్ వంచించాడు. చికిత్స పేరుతో అర్థనగ్నంగా ఉండమని చెప్పి, సీసీ కెమెరాల్లో బంధించి పలుమార్లు ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని పూణేలో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకివెళితే.. సురేష్ అనే వ్యక్తి ఓ ఆయుర్వేద వైద్యుడుగా పనిచేస్తున్నాడు. వైద్యం కోసం తన వద్దకు వచ్చిన ఓ యువతిపై కన్నేశాడు. బాధిత యువతి వృత్తిరీత్యా సాఫ్ట్వేర్ ఉద్యోగిని. కొంత కాలంగా ఆమె […]
దిశ, వెబ్‌డెస్క్ : వైద్యం కోసం వచ్చిన మహిళా సాఫ్ట్వేర్ ఇంజినీర్‌ను ఓ కీచక డాక్టర్ వంచించాడు. చికిత్స పేరుతో అర్థనగ్నంగా ఉండమని చెప్పి, సీసీ కెమెరాల్లో బంధించి పలుమార్లు ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని పూణేలో ఆలస్యంగా వెలుగుచూసింది.
వివరాల్లోకివెళితే.. సురేష్ అనే వ్యక్తి ఓ ఆయుర్వేద వైద్యుడుగా పనిచేస్తున్నాడు. వైద్యం కోసం తన వద్దకు వచ్చిన ఓ యువతిపై కన్నేశాడు. బాధిత యువతి వృత్తిరీత్యా సాఫ్ట్వేర్ ఉద్యోగిని. కొంత కాలంగా ఆమె నడుము నొప్పితో భాధ పడుతోంది.ఈ క్రమంలోనే తన స్నేహితురాలి సలహా మేరకు డాక్టర్ సురేష్ వద్దకు వెళ్లింది. ఆమెతో చికిత్సకు చాలా సమయం పడుతుందని, పిలిచిన ప్రతీసారి రావాల్సి ఉంటుందని సురేశ్ నమ్మపలికాడు.
విధుల్లో భాగంగా ప్రతిసారీ రాలేనని చెప్పడంతో.. కుదిరినప్పుడు రమ్మడి అతను సూచించాడు. ఈ క్రమంలోనే నడుము నొప్పి పూర్తిగా తగ్గాలంటే పంచకర్మ చేయాలని చెప్పాడు. ఆయుర్వేద పంచకర్మ మసాజ్ ద్వారా ఒంటినొప్పులన్ని మాయం అవుతాయని ఆ యువతిని నమ్మించాడు. అక్కడకు వెళ్లిన బాధితురాలని అర్థనగ్నంగా ఉండాలని చెప్పడంతో ఆమె అలాగే చేసింది.
ఇక మసాజ్ చేస్తున్న క్రమంలో సీక్రెట్‌గా అమర్చిన కెమెరాల ద్వారా వీడియోలు చిత్రీకరించాడు. వాటిని వాట్సప్ ద్వారా ఆమెకు పంపించాడు. అవి చూసిన బాధితురాలు ఒక్కసారిగా షాక్ అయ్యింది. తనకు ఇంకా పెళ్లి కాలేదని చాలా బతిమిలాడింది. అయితే, తన కోరిక తీర్చాలని పట్టుబట్టాడు. ఆమెను భయపెట్టి పలుమార్లు అత్యాచారం చేశాడు. అలా ఇష్టం వచ్చినప్పుడల్లా క్లినిక్‌కు పిలిచేవాడు. మరో 30 వీడియోలు తీసి, అవన్నీ చూపించి ఇంకా భయభ్రాంతులకు గరిచేశాడు. దీంతో చేసేదేమీలేక బాధితురాలు కుటుంబసభ్యుల సాయంతో పోలీసులను ఆశ్రయించింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిపారు.