ఎన్నికల బరిలో యువ టెకీ.. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ..

దిశ, మిర్యాలగూడ: యువత రాజకీయాల్లోకి రావాలన్న మేధావుల పిలుపును వంట పట్టించుకున్న ఓ యువ ఇంజినీర్ విదేశాల్లో సాఫ్ట్ వేర్ ఉద్యోగం వదిలి… వరంగల్- నల్గొండ- ఖమ్మం నియోజకవర్గ పట్టభద్రుల ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. విద్యావంతులు తనకు అవకాశం ఇస్తే నీతివంతమైన మార్పుతో కూడిన రాజకీయాలు చేస్తానని అంటున్నారు. వివరాల్లోకి వెళితే… సూర్యాపేట జిల్లా పాలకవీడు గ్రామానికి చెందిన మందపూడి శివప్రసాద్ పదేళ్లుగా ఐటీ రంగంలో టెక్నాలజీ ఆర్కిటెక్ట్‌గా రాణిస్తూ లక్షల్లో జీతం సంపాదిస్తున్నారు. […]

Update: 2021-03-11 06:31 GMT

దిశ, మిర్యాలగూడ: యువత రాజకీయాల్లోకి రావాలన్న మేధావుల పిలుపును వంట పట్టించుకున్న ఓ యువ ఇంజినీర్ విదేశాల్లో సాఫ్ట్ వేర్ ఉద్యోగం వదిలి… వరంగల్- నల్గొండ- ఖమ్మం నియోజకవర్గ పట్టభద్రుల ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. విద్యావంతులు తనకు అవకాశం ఇస్తే నీతివంతమైన మార్పుతో కూడిన రాజకీయాలు చేస్తానని అంటున్నారు.

వివరాల్లోకి వెళితే… సూర్యాపేట జిల్లా పాలకవీడు గ్రామానికి చెందిన మందపూడి శివప్రసాద్ పదేళ్లుగా ఐటీ రంగంలో టెక్నాలజీ ఆర్కిటెక్ట్‌గా రాణిస్తూ లక్షల్లో జీతం సంపాదిస్తున్నారు. విధుల్లో భాగంగా విదేశాల నుండి ఆఫర్ వచ్చినప్పటికి కాదనుకొని.. వరంగల్-నల్గొండ-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. వర్క్ ప్రమ్ హోమ్‌లో భాగంగా తనదైన శైలిలో ప్రచారం సాగిస్తున్నారు. నీతివంతమైన, అభివృద్ధి రాజకీయలను.. యువత ఆదరించి తన అభ్యర్థిత్వాన్ని బలపరచాలని కోరుతున్నాడు. డబ్బుతో ఓటు కొనుక్కోవచ్చనే ఆలోచన సరికాదు. యువత తమ ఆలోచనలను ప్రజా సేవకు మళ్లిస్తేనే ప్రస్తుత పాలకులు బాధ్యతగా మెలగుతారని తెలిపారు.

 

Tags:    

Similar News