నాగర్ కర్నూల్లో సోడియం హైపో క్లోరైట్ స్ప్రే
దిశ, మహబూబ్ నగర్: కరోనా వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని పలు వీధులు, మెయిన్ రోడ్డుపై సోడియం హైపో క్లోరైట్‌ను ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి సూచనల మేరకు జిల్లా యంత్రాంగం పిచికారి చేయించింది. ఈ సందర్భంగా జనార్ధన్ మాట్లాడుతూ.. కరోనా వ్యాప్తి నియంత్రణకు ప్రజలందరూ సహకరించాలని కోరారు. అలాగే, పట్టణంలోని మెయిన్ రోడ్డు, నాగనూల్ రోడ్డు, శ్రీపురం రోడ్డుతో పాటు, పలు కాలనీల్లోనూ పిచికారరి చేయించాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. […]
దిశ, మహబూబ్ నగర్: కరోనా వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని పలు వీధులు, మెయిన్ రోడ్డుపై సోడియం హైపో క్లోరైట్‌ను ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి సూచనల మేరకు జిల్లా యంత్రాంగం పిచికారి చేయించింది. ఈ సందర్భంగా జనార్ధన్ మాట్లాడుతూ.. కరోనా వ్యాప్తి నియంత్రణకు ప్రజలందరూ సహకరించాలని కోరారు. అలాగే, పట్టణంలోని మెయిన్ రోడ్డు, నాగనూల్ రోడ్డు, శ్రీపురం రోడ్డుతో పాటు, పలు కాలనీల్లోనూ పిచికారరి చేయించాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తెరాస రాష్ట్ర నాయకులు జక్కా రఘునందన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ కల్పన, మార్కెట్ చైర్మన్ ఈశ్వర్ రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్స్, అధికారులు పాల్గొన్నారు.
Tags: corona, virus, sodium hypo cloride, sprayed, MLA janardhan reddy, TRS leaders