‘అధైర్యపడొద్దు బిడ్డా.. నేనున్నాను’.. వైరల్ అవుతున్న బాల రైతు వీడియో

దిశ, హుస్నాబాద్ : అధైర్యపడొద్దు బిడ్డా నేనున్నానుంటూ.. ఆర్థిక ఇబ్బందులతో అల్లాడుతున్న ఓ చిన్నారి రైతుకు సామాజిక సేవకురాలు కర్ణకంటి మంజులరెడ్డి ఆర్థిక సాయమందించారు. వివరాల్లోకి వెళితే.. సిద్దిపేట జిల్లా కొహెడ మండలం వింజపల్లి గ్రామానికి చెందిన మంద అజయ్(13) కన్నతల్లి మంద లత చిన్నతనంలోనే ఆనారోగ్యంతో మృతి చెందింది. తండ్రి మొగిలయ్య వికలాంగుడు కావడంతో ఆ చిట్టి చేతులతో నానమ్మ సూరమ్మ సహాయంతో తనకున్న 20 గుంటల వ్యవసాయ పొలంలో అప్పుచేసి వరిపంట వేసినట్టు చెప్పాడు. […]

Update: 2021-11-07 08:44 GMT

దిశ, హుస్నాబాద్ : అధైర్యపడొద్దు బిడ్డా నేనున్నానుంటూ.. ఆర్థిక ఇబ్బందులతో అల్లాడుతున్న ఓ చిన్నారి రైతుకు సామాజిక సేవకురాలు కర్ణకంటి మంజులరెడ్డి ఆర్థిక సాయమందించారు. వివరాల్లోకి వెళితే.. సిద్దిపేట జిల్లా కొహెడ మండలం వింజపల్లి గ్రామానికి చెందిన మంద అజయ్(13) కన్నతల్లి మంద లత చిన్నతనంలోనే ఆనారోగ్యంతో మృతి చెందింది. తండ్రి మొగిలయ్య వికలాంగుడు కావడంతో ఆ చిట్టి చేతులతో నానమ్మ సూరమ్మ సహాయంతో తనకున్న 20 గుంటల వ్యవసాయ పొలంలో అప్పుచేసి వరిపంట వేసినట్టు చెప్పాడు.

గత రెండు నెలల కిందట కురిసిన భారీ వర్షాలకు పంటపొలం నుంచి వరద వెళ్లగా.. దీంతో ఇసుక, మట్టి పంటపొలంలో పేరుకుపోయిందని కన్నీటి పర్యంతమయ్యాడు. చిన్నారి అజయ్ తీవ్ర మనోవేదనకు గురై తన పంట పొలాన్ని చూపిస్తూ ఓ వీడియో తీయగా.. అది కాస్త సోషల్ మీడియాల్లో వైరల్ అయ్యింది. చిన్నారి రైతు తీసిన వీడియోను చూసి చలించిపోయిన సామాజిక సేవకురాలు మంజులా రెడ్డి ఆ బాలుడి కుటుంబాన్ని ఓదార్చి రూ.10 వేల ఆర్థిక సాయమందించడంతో పాటు ‘నేనున్నా బిడ్డా’ అంటూ మనోధైర్యాన్ని నింపారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచి తిరుపతి రెడ్డి, మంజులక్క యువసేన సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News