‘స్నేహ’ మేరా జీవితం .. యానివర్సరీ విష్ చేసుకున్న క్రేజీ కపుల్

స్నేహ.. తమిళ్ అమ్మాయే అయినా అచ్చ తెలుగు ఆడపడుచులా కనిపిస్తుంది. తెలుగు, తమిళ్ లో హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న స్నేహ.. ఆ తర్వాత తమిళ నటుడు ప్రసన్నను ప్రేమ వివాహం చేసుకుంది. 2012 మే 11న వీరిద్దరి పెళ్లి కాగా.. దాంపత్య జీవితానికి ఎనిమిదేళ్లు. ఈ సందర్భంగా మ్యారేజ్ యానివర్సరీని పురస్కరించుకుని ఒకరినొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటూ ట్వీట్ చేశారు స్నేహ ప్రసన్న.   View this post on Instagram   Its been […]

Update: 2020-05-11 05:08 GMT

స్నేహ.. తమిళ్ అమ్మాయే అయినా అచ్చ తెలుగు ఆడపడుచులా కనిపిస్తుంది. తెలుగు, తమిళ్ లో హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న స్నేహ.. ఆ తర్వాత తమిళ నటుడు ప్రసన్నను ప్రేమ వివాహం చేసుకుంది. 2012 మే 11న వీరిద్దరి పెళ్లి కాగా.. దాంపత్య జీవితానికి ఎనిమిదేళ్లు. ఈ సందర్భంగా మ్యారేజ్ యానివర్సరీని పురస్కరించుకుని ఒకరినొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటూ ట్వీట్ చేశారు స్నేహ ప్రసన్న.

స్నేహతో ప్రేమానురాగాల ప్రయాణానికి ఎనిమిదేళ్లు. ఈ బంధం ఇలాగే మరింత సంతోషంగా సాగాలని కోరుకుంటున్న అని తెలిపిన ప్రసన్న.. ఈ జన్మలో స్నేహ ప్రేమ లభించడం ఆశీర్వాదంగా భావిస్తున్నట్లు చెప్పాడు. తనతో కలిసి ఉన్న రొమాంటిక్ అండ్ లవ్ లీ పిక్స్ షేర్ చేశాడు ప్రసన్న.

ప్రసన్నతో ఇంత అద్భుతమైన క్రేజీ జర్నీని లైఫ్ లాంగ్ కోరుకుంటున్నట్లు తెలిపింది స్నేహ. ఈ అందమైన ప్రయాణంలో మరిన్ని అద్భుతమైన జ్ఞాపకాలు తయారు చేసుకుందామంటూ ప్రసన్నకు విష్ చేసింది. మేము ఇలాగే సంతోషంగా జీవించేందుకు మీ ఆశీస్సులు కావాలని ప్రేక్షకులను కోరింది.

Tags:    

Similar News

Sharvari

Ishita Raj Sharma