త్వరలో స్మార్ట్‌ఫోన్ ధరలకు రెక్కలు!

దిశ, వెబ్‌డెస్క్: కరోనా నుంచి కోలుకుంటున్న స్మార్ట్‌ఫోన్ ఇండస్ట్రీ త్వరలో మొబైల్‌ఫోన్ల ధరలను పెంచేందుకు సిద్ధమవుతున్నాయి. స్మార్ట్‌ఫోన్‌ల తయారీలో ఉపయోగించే డిస్‌ప్లే, టచ్ ప్యానెళ్లపౌ కేంద్రం 10 శాతం దిగుమతి సుంకాన్ని విధించిన నేపథ్యంలో ప్రముఖ బ్రాండ్ స్మార్ట్‌ఫోన్ తయారీదారులు పెరిగిన భారాన్ని వినియోగదారులపై వేసేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నాయి. యాపిల్, శాంసంగ్, షియోమీ, ఒప్పో వంటి ప్రముఖ బ్రాండ్ కంపెనీలన్నీ ధరల పెరుగుదలను అమలు చేయనున్నట్టు పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆత్మ […]

Update: 2020-10-02 07:06 GMT

దిశ, వెబ్‌డెస్క్: కరోనా నుంచి కోలుకుంటున్న స్మార్ట్‌ఫోన్ ఇండస్ట్రీ త్వరలో మొబైల్‌ఫోన్ల ధరలను పెంచేందుకు సిద్ధమవుతున్నాయి. స్మార్ట్‌ఫోన్‌ల తయారీలో ఉపయోగించే డిస్‌ప్లే, టచ్ ప్యానెళ్లపౌ కేంద్రం 10 శాతం దిగుమతి సుంకాన్ని విధించిన నేపథ్యంలో ప్రముఖ బ్రాండ్ స్మార్ట్‌ఫోన్ తయారీదారులు పెరిగిన భారాన్ని వినియోగదారులపై వేసేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నాయి. యాపిల్, శాంసంగ్, షియోమీ, ఒప్పో వంటి ప్రముఖ బ్రాండ్ కంపెనీలన్నీ ధరల పెరుగుదలను అమలు చేయనున్నట్టు పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆత్మ నిర్భర్ భారత్ కార్యక్రమంలో భాగంగా స్థానిక ఉత్పత్తి రంగాన్ని ప్రోత్సహించేందుకు పలు దిగుమతి వస్తువులపై సుంకాలను విధిస్తోంది. ప్రభుత్వ తాజా నిర్ణయం కారణంగా డిస్‌ప్లే, టచ్ ప్యానెళ్లపై సుంకంతో పాటుగా అదనంగా సెస్‌ను విధిస్తే దిగుమతి చేసుకునే కంపెనీలపై 11 శాతం వరకు భారం ఉండనుంది. ఈ పెరుగుదలతో స్మార్ట్‌ఫోన్ ధరలు కనీసం 2 శతం నుంచి 5 శాతం వరకు పెరిగే అవకాశాలున్నాయని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. అయితే, ఇప్పుడిప్పుడే కరోనా సంక్షోభం నుంచి కోలుకుంటున్న స్మార్ట్‌ఫోన్ పరిశ్రమకు పండుగ సీజన్ సానుకూలంగా ఉంటుందని భావిస్తున్న తరుణంలో ధరల పెరుగుదల శరాఘాతంగా మారింది. అయితే, పండుగ సీజన్ వరకు కంపెనీలు ఆగుతాయా లేక నష్టాలను అధిగమించేందుకు తప్పక ధరలను పెంచుతాయా అనే వేచి చూడాలని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Tags:    

Similar News