పోలీసుల కాల్పుల్లో ఆరుగురు ఉగ్రవాదులు హతం
దిశ, వెబ్‌డెస్క్: అస్సోంలో ఉగ్రవాదులపై పోలీసులు దండెత్తారు. ధనసిరి ప్రాంతంలోని అసోం-నాగాలాండ్ సరిహద్దు వద్ద కాల్పులు చోటు చేసుకున్నాయి. ఆదివారం ఉదయం నిర్వహించిన ఈ ఆపరేషన్ లో ఆరుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. అసోంలోని తిరుగుబాటు సంస్థ దిమాసా నేషనల్ లిబరేషన్ ఆర్మీ (డీఎన్‌ఎల్‌ఏ)కు చెందిన ఆరుగురు ఉగ్రవాదులను పోలీసులు హతమార్చారు. వారి వద్ద నుండి నాలుగు ఏకే-47, మరో నాలుగు తుపాకులు, భారీ స్థాయిలో పేలుడు పదార్థాలు, ఆయుధ సామగ్రిని బలగాలు స్వాధీనం చేసుకున్నట్లు అస్సోం పోలీస్ […]
దిశ, వెబ్‌డెస్క్: అస్సోంలో ఉగ్రవాదులపై పోలీసులు దండెత్తారు. ధనసిరి ప్రాంతంలోని అసోం-నాగాలాండ్ సరిహద్దు వద్ద కాల్పులు చోటు చేసుకున్నాయి. ఆదివారం ఉదయం నిర్వహించిన ఈ ఆపరేషన్ లో ఆరుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. అసోంలోని తిరుగుబాటు సంస్థ దిమాసా నేషనల్ లిబరేషన్ ఆర్మీ (డీఎన్‌ఎల్‌ఏ)కు చెందిన ఆరుగురు ఉగ్రవాదులను పోలీసులు హతమార్చారు. వారి వద్ద నుండి నాలుగు ఏకే-47, మరో నాలుగు తుపాకులు, భారీ స్థాయిలో పేలుడు పదార్థాలు, ఆయుధ సామగ్రిని బలగాలు స్వాధీనం చేసుకున్నట్లు అస్సోం పోలీస్ స్పెషల్ డైరెక్టర్ జనరల్ జీపీ సింగ్ ట్వీట్ చేశారు.
In an early morning operation by @assampolice and Assam Rifles, six DNLA terrorists were neutralised in Dhansiri area of Karbi Anglong district. Large cache of arms & ammunition also recovered. @adgpi
— GP Singh (@gpsinghassam) May 23, 2021