'దేవుడిలాగా పూజించాల్సిన వ్యక్తి కేసీఆర్'
దిశ సిద్దిపేట: తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే కాకుండా సాగునీటి ప్రాజెక్టులతో తెలంగాణను గ్రీన్ తెలంగాణగా మార్చి ప్రజల జీవితాల్లో గణనీయమైన మార్పులు తెచ్చిన గొప్ప వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు అని అడ్వకేట్ జనరల్ పి ఎస్ ప్రసాద్ అన్నారు. దేవుడి లాగా ఆయన చిత్రపటాన్ని పెట్టుకొని పూజించాల్సిన గొప్ప వ్యక్తి కేసీఆర్ అని కొనియాడారు. సోమవారం చేర్యాల మండలంలోని తన స్వగ్రామం దొమ్మాటను శివానంద ప్రసాద్ సందర్శించారు. గ్రామ పంచాయతీ అవరణలో గ్రామ […]
దిశ సిద్దిపేట: తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే కాకుండా సాగునీటి ప్రాజెక్టులతో తెలంగాణను గ్రీన్ తెలంగాణగా మార్చి ప్రజల జీవితాల్లో గణనీయమైన మార్పులు తెచ్చిన గొప్ప వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు అని అడ్వకేట్ జనరల్ పి ఎస్ ప్రసాద్ అన్నారు. దేవుడి లాగా ఆయన చిత్రపటాన్ని పెట్టుకొని పూజించాల్సిన గొప్ప వ్యక్తి కేసీఆర్ అని కొనియాడారు. సోమవారం చేర్యాల మండలంలోని తన స్వగ్రామం దొమ్మాటను శివానంద ప్రసాద్ సందర్శించారు. గ్రామ పంచాయతీ అవరణలో గ్రామ ప్రజలతో సమావేశం అయ్యారు. గ్రామంతో తనకు, తమ కుటుంబానికి ఉన్న అనుబంధాన్ని అడ్వొకేట్ జనరల్ నెమరు వేసుకున్నారు. ప్రజల యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు.గ్రామ అభివృద్ధి కోసం తన వంతు సహకారం అందిస్తామని అన్నారు.
జిల్లా యంత్రాంగం సహకారం స్థానిక ప్రజల భాగస్వామ్యంతో దొమ్మాటను ఆదర్శంగా గ్రామంగా తీర్చి దిద్దుతామన్నారు. అభివృద్ధి పనులు పూర్తి చేసేందుకు గ్రామ ప్రజలంతా కలిసి కట్టుగా పని చేయాలన్నారు. ఈ సందర్భంగా శివానంద ప్రసాద్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తన మీద ఉన్న నమ్మకంతో తెలంగాణ రాష్ట్ర అడ్వకేట్ జనరల్ గా తనను ఎంపిక చేశారని తెలిపారు. తాను అడ్వకేట్ జనరల్ గా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఎన్నో ముఖ్యమైన కేసులను రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున వాదించి అనేక కేసుల్లో విజయం సాధించడంతో సఫలీకృతం అయ్యామన్నారు.
సీఎం కెసిఆర్ తెలంగాణ ప్రజల దశాబ్దాల స్వరాష్ట్ర కల నెరవేర్చడమే కాకుండా… తెలంగాణ రాష్ట్రంలో దేశానికే నమూనాగా ఉండేలా అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నారని కొనియాడారు. ముఖ్యంగా సాగునీటి ప్రాజెక్టులను వేగంగా నిర్మిస్తున్నారని అన్నారు. గోదావరి జలాలను కొండ పోచమ్మ సాగర్ కు తీసుకువచ్చి మనకు అందించడం మన అందరి మహాభాగ్యం అని ఆయన అన్నారు.సాగు నీళ్లతో తెలంగాణ ఇప్పుడు గ్రీన్ తెలంగాణ గా మారిందన్నారు. దేశానికి ప్రధానమంత్రి అయ్యే శక్తి ఉన్న వ్యక్తి కెసిఆర్ అని ఆయన పేర్కొన్నారు. దేశానికి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రధాన మంత్రి అయితే దేశం ప్రగతి పథంలో నడుస్తుందని ఆయన అన్నారు.