టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ సీరియస్ వార్నింగ్.. ఏమైందంటే ?
దిశ, బెజ్జుర్: టీఆర్ఎస్ పార్టీ ఓటమి తెలంగాణలో సిర్పూర్ నుండి ప్రారంభం కావాలని సిర్పూర్ లో నీలి జెండా ఎగురవేయాలని బీఎస్పీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. శనివారం కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండల కేంద్రంలో బహుజనుల ఆత్మగౌరవ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దళితులను ముఖ్యమంత్రి చేస్తానని గద్దెనెక్కి దళితులను మోసం చేశారని ఆరోపించారు. సిర్పూర్ నియోజకవర్గంలో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు ద్వారా రైతులకు […]
దిశ, బెజ్జుర్: టీఆర్ఎస్ పార్టీ ఓటమి తెలంగాణలో సిర్పూర్ నుండి ప్రారంభం కావాలని సిర్పూర్ లో నీలి జెండా ఎగురవేయాలని బీఎస్పీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. శనివారం కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండల కేంద్రంలో బహుజనుల ఆత్మగౌరవ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దళితులను ముఖ్యమంత్రి చేస్తానని గద్దెనెక్కి దళితులను మోసం చేశారని ఆరోపించారు. సిర్పూర్ నియోజకవర్గంలో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు ద్వారా రైతులకు చుక్క నీరు అందడం లేదని కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి తన సొంత ప్రయోజనాలకు ఆ నీటిని వాడుకుంటున్నారని విమర్శించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం అని విమర్శించారు.
సిర్పూర్ నియోజకవర్గంలో 2014లో బీఎస్పీ పార్టీ గుర్తుతో గెలుపొందిన కోనేరు కోనప్ప టీఆర్ఎస్ పార్టీకి అమ్ముడు పోయారని విమర్శించారు. నియోజకవర్గంలో రోడ్లు, విద్య సక్రమంగా లేదన్నారు. బీఎస్పీ అధికారంలోకి వస్తే అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు. తమ కార్యకర్తలపై సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కేసులు పెడితే ఊరుకునేది లేదన్నారు. బహుజనుల రాజ్యం రావాలంటే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఏనుగు గుర్తును గెలిపించాలని కోరారు. అనంతరం డిఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు మంద ప్రభాకర్ మాట్లాడారు. బహుజన రాజ్యం రావాలంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను గద్దె ఎక్కించాలని సూచించారు. ఈ సభలో హర్షథ్ హుస్సేన్, ఆకుల సంతోష్, కొండ రాంప్రసాద్, ప్రవీణ్ కుమార్, పొన్నాల నారాయణ, షేక్ చాంద్, జ్యోతిలు పాల్గొన్నారు.