ఒక్క క్లిక్‌తో మీ ఇంటికే సరుకులు

దిశ, వరంగల్ : కరోనా విస్తరించకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్ విధించింది. ఈ నేపథ్యంలో ప్రజలు బయటకు వెళ్లి సరుకులు తెచ్చుకోవడం ఇబ్బందిగా మారింది. ఈ క్రమంలో సరకులు నేరుగా మీ ఇంటికి రావాలంటే గూగుల్ ప్లే స్టోర్‌కు వెళ్లి READY TO DOOR యాప్‌ను ఇన్ట్సాల్ చేసుకోవాలి. దీని ద్వారా మార్కెట్ కంటే తక్కువ ధరలకే నిత్యావసర సరుకులు అందజేసేందుకు ఇద్దరు యువకులు ముందుకొచ్చారు. ప్రతిరోజూ ఉదయం 9.00 గం.ల నుండి రాత్రి 8.00 […]

Update: 2020-03-31 10:29 GMT

దిశ, వరంగల్ :

కరోనా విస్తరించకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్ విధించింది. ఈ నేపథ్యంలో ప్రజలు బయటకు వెళ్లి సరుకులు తెచ్చుకోవడం ఇబ్బందిగా మారింది. ఈ క్రమంలో సరకులు నేరుగా మీ ఇంటికి రావాలంటే గూగుల్ ప్లే స్టోర్‌కు వెళ్లి READY TO DOOR యాప్‌ను ఇన్ట్సాల్ చేసుకోవాలి. దీని ద్వారా మార్కెట్ కంటే తక్కువ ధరలకే నిత్యావసర సరుకులు అందజేసేందుకు ఇద్దరు యువకులు ముందుకొచ్చారు. ప్రతిరోజూ ఉదయం 9.00 గం.ల నుండి రాత్రి 8.00 గంటల వరకు ఆన్‌లైన్‌లో బుక్ చేస్తే సరుకులు ఇంటికి తెచ్చి ఇస్తారు.ఒక్క క్లిక్‌తో ఇంటికే సరుకులు‌ అందించేందుకు వీలుగా వరంగల్‌కు చెందిన యువకులు అరుణ్, రాకేష్ రూపొందించిన యాప్ ఏడాది పూర్తైన సందర్బంగా మంత్రి సత్యవతి రాథోడ్ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ వారిని అభినందించారు. మంగళవారం పోచమ్మ మైదాన్ సెంటర్‌లో ఓ కార్యక్రమానికి వచ్చిన మంత్రి, ఎమ్మెల్యేలు యాప్ గురించి తెలుసుకున్నారు. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ప్రజలకు ఇది ఒక చక్కని అవకాశం అని, ఒక్క క్లిక్ తో మీ ఇంటికే సరుకులు వచ్చే అవకాశం ఉందని తెలిపారు.దీని వలన సమయం ఆదా అవుతుందని, జనాలు ఒకే చోట సమూహంగా ఉండటాన్ని నివారించవచ్చన్నారు. కార్యక్రమంలో కార్పోరేటర్లు కావేటి కవిత రాజు యాదవ్, శారద సురేష్ జోషి, కుడా డైరెక్టర్ మోడెం ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

Tags: carona, lockdown, single click, goods door delivery

Tags:    

Similar News