సింగర్ సునీత మ్యారేజ్ డేట్ ఫిక్స్..

దిశ, వెబ్‌డెస్క్ : సింగర్ సునీత పెళ్లి.. టాలీవుడ్‌లో క్రేజీ టాపిక్ అయిపోయింది. ప్రముఖ మీడియా సంస్థ అధినేత రామ్ వీరపనేనితో తనకు ఇటీవలే ఎంగేజ్‌మెంట్ కాగా, మ్యారేజ్ డేట్ ఎప్పుడు ప్రకటిస్తారా..? అని అభిమానులు వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సునీత.. కళ్యాణం తేదీ గురించి వెల్లడించింది. వచ్చే నెల 9న రెండో పెళ్లి చేసుకోబోతున్నానని, కొత్తగా ప్రారంభించబోయే జీవితం బాగుండాలని స్వామి వారిని ప్రార్థించినట్లు చెప్పింది. కానీ కొద్ది మంది […]

Update: 2020-12-31 06:09 GMT

దిశ, వెబ్‌డెస్క్ : సింగర్ సునీత పెళ్లి.. టాలీవుడ్‌లో క్రేజీ టాపిక్ అయిపోయింది. ప్రముఖ మీడియా సంస్థ అధినేత రామ్ వీరపనేనితో తనకు ఇటీవలే ఎంగేజ్‌మెంట్ కాగా, మ్యారేజ్ డేట్ ఎప్పుడు ప్రకటిస్తారా..? అని అభిమానులు వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సునీత.. కళ్యాణం తేదీ గురించి వెల్లడించింది.

వచ్చే నెల 9న రెండో పెళ్లి చేసుకోబోతున్నానని, కొత్తగా ప్రారంభించబోయే జీవితం బాగుండాలని స్వామి వారిని ప్రార్థించినట్లు చెప్పింది. కానీ కొద్ది మంది బంధువుల మధ్యే వివాహ మహోత్సవం జరగబోతుందని తెలిపింది. కరోనా కారణంగా దాదాపు తొమ్మిది నెలలు శ్రీవారిని దర్శించుకోలేక పోయానని.. ఇప్పుడు ప్రశాంతంగా ఉందని తెలిపింది. కాగా సునీత మొదటి భర్తతో విడిపోగా, తనకు ఇద్దరు పిల్లలున్నారు.

Tags:    

Similar News