సింగర్ స్మిత హంబుల్ అనౌన్స్‌మెంట్.. అసంతృప్తి నుంచి పుట్టిందే!
దిశ, సినిమా : సింగర్ స్మిత సరికొత్త ప్రయత్నం చేయబోతోంది. ఇప్పటి వరకు సింగర్, డ్యాన్సర్, ఆర్టిస్ట్, ఎంట్రప్రెన్యూర్, స్పిరిచ్యువల్ స్పీకర్, సోషల్ యాక్టివిస్ట్‌గా కనిపించిన స్మిత.. ఈ సారి సమాజాన్ని ప్రశ్నించేందుకు సిద్ధమవుతోంది. ‘చుట్టూ ఉన్న ప్రపంచానికి చేయాల్సింది చాలా ఉందని, కానీ ఆగిపోతున్నానేమో అనే చిన్న అసంతృప్తి నుంచి పుట్టిన వినయ ప్రయత్నమే ‘యువర్ హానర్’ కార్యక్రమం అని తెలిపింది. ప్రజల కోసం, ప్రజల తరపున, ప్రజల గురించి మాట్లాడే ఈ ప్రోగ్రామ్ టీవీ5లో […]
దిశ, సినిమా : సింగర్ స్మిత సరికొత్త ప్రయత్నం చేయబోతోంది. ఇప్పటి వరకు సింగర్, డ్యాన్సర్, ఆర్టిస్ట్, ఎంట్రప్రెన్యూర్, స్పిరిచ్యువల్ స్పీకర్, సోషల్ యాక్టివిస్ట్‌గా కనిపించిన స్మిత.. ఈ సారి సమాజాన్ని ప్రశ్నించేందుకు సిద్ధమవుతోంది. ‘చుట్టూ ఉన్న ప్రపంచానికి చేయాల్సింది చాలా ఉందని, కానీ ఆగిపోతున్నానేమో అనే చిన్న అసంతృప్తి నుంచి పుట్టిన వినయ ప్రయత్నమే ‘యువర్ హానర్’ కార్యక్రమం అని తెలిపింది. ప్రజల కోసం, ప్రజల తరపున, ప్రజల గురించి మాట్లాడే ఈ ప్రోగ్రామ్ టీవీ5లో ప్రసారం కానుందని చెప్పింది. ఇందుకోసం ఓ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ను కూడా ఎంచుకున్నామని.. త్వరలో ఇందుకు సంబంధించిన వివరాలు తెలియజేస్తామని సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.
That’s all Your Honour ⚖️ pic.twitter.com/CxnxOO8Qco
— Smita (@smitapop) April 6, 2021