సింగరేణి ప్రైవేటీకరణను అడ్డుకుంటాం

దిశ, ఆదిలాబాద్: సింగరేణి యాజమాన్యాన్ని కోల్ ఇండియాలో విలీనం చేయడంతో పాటు, ప్రైవేటీకరించే చర్యలను అడ్డుకుంటామని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు కలవేణ శంకర్ హెచ్చరించారు. ఇప్పటికే ఎన్డీఏ ప్రభుత్వం జాతీయస్థాయిలో బొగ్గు గనులను ప్రైవేటీకరణకు కుట్ర చేస్తున్నదని ఆయన ఆరోపించారు. మంగళవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దేశంలో సింగరేణి యాజమాన్యానికి ప్రత్యేక గుర్తింపు ఉందని, స్వయంగా నిర్ణయాలు తీసుకునే అధికారాలు ఉన్నాయని చెప్పారు. సింగరేణిని ప్రైవేటీకరిస్తే తెలంగాణ వ్యాప్తంగా ఉన్న బొగ్గు […]

Update: 2020-06-09 05:34 GMT

దిశ, ఆదిలాబాద్: సింగరేణి యాజమాన్యాన్ని కోల్ ఇండియాలో విలీనం చేయడంతో పాటు, ప్రైవేటీకరించే చర్యలను అడ్డుకుంటామని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు కలవేణ శంకర్ హెచ్చరించారు. ఇప్పటికే ఎన్డీఏ ప్రభుత్వం జాతీయస్థాయిలో బొగ్గు గనులను ప్రైవేటీకరణకు కుట్ర చేస్తున్నదని ఆయన ఆరోపించారు. మంగళవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దేశంలో సింగరేణి యాజమాన్యానికి ప్రత్యేక గుర్తింపు ఉందని, స్వయంగా నిర్ణయాలు తీసుకునే అధికారాలు ఉన్నాయని చెప్పారు. సింగరేణిని ప్రైవేటీకరిస్తే తెలంగాణ వ్యాప్తంగా ఉన్న బొగ్గు గనులను కార్మికులతో ముట్టడిస్తామని హెచ్చరించారు.

Tags:    

Similar News