నల్ల సూరులకు గూడు ఎత్తుగడలో భాగమేనా?
దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: ఒక వైపు సింగరేణిలో గుర్తింపు ఎన్నికల ఒత్తిడి పెరుగుతున్న వేళ.. సర్కారు కార్మికులకు తీపి కబురు చెప్పింది. ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న బొగ్గు గని కార్మికుల ఇళ్ల నిర్మాణం ఫైలు దుమ్ము దులిపి తెర మీదకు తెచ్చిందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. తాజాగా సింగరేణి బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశమవుతోంది. రూ.110 కోట్లతో కార్మికులకు గృహాల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించామని సంస్థ ప్రకటించడం గమనార్హం. దీంతో కార్మిక వర్గాల్లో […]
దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: ఒక వైపు సింగరేణిలో గుర్తింపు ఎన్నికల ఒత్తిడి పెరుగుతున్న వేళ.. సర్కారు కార్మికులకు తీపి కబురు చెప్పింది. ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న బొగ్గు గని కార్మికుల ఇళ్ల నిర్మాణం ఫైలు దుమ్ము దులిపి తెర మీదకు తెచ్చిందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. తాజాగా సింగరేణి బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశమవుతోంది. రూ.110 కోట్లతో కార్మికులకు గృహాల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించామని సంస్థ ప్రకటించడం గమనార్హం. దీంతో కార్మిక వర్గాల్లో కొత్త ఆశలు రేకెత్తిస్తున్నాయి.
కార్మికులకు కొత్త ఇల్లు నిర్మించాలని నిర్ణయం తీసుకోవడాన్ని స్వాగతిస్తున్నామని సింగరేణి కార్మిక సంఘాలు తెలిపాయి. సింగరేణి ఎన్నికలు నిర్వహించాలన్న సమయంలో బోర్డు ఈ నిర్ణయాన్ని ప్రకటించడం పై కార్మిక సంఘాల్లో అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.