నకిలీ పాస్‌పోర్టులు తయారు చేస్తున్న సికిందరన్‌ అరెస్ట్

దిశ, క్రైమ్‌బ్యూరో: ట్రావెల్ ఏజెన్సీ పేరిట నకిలీ పాస్‌పోర్టు, వీసాలను తయారు చేస్తున్న పాత నేరస్థుణ్ని టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. అడిషనల్ డీసీపీ చక్రవర్తి గుమ్మి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్ కాలాపత్తర్ బిలాల్‌నగర్‌కు చెందిన సికిందర్‌న్ గతంలో వీడియో గ్రాఫర్‌గా పనిచేశాడు. ఉద్యోగం నిమిత్తం 2012లో దుబాయ్ వెళ్లి ఏడాది పాటు ఉన్నాడు. ఈ సమయంలో ఇతర దేశాలకు వెళ్లేందుకు ప్రాసెస్ చేసే వీసా గురించి బాగా అవగాహన పెంచుకున్నాడు. ఈజీగా డబ్బు […]

Update: 2020-08-12 09:57 GMT

దిశ, క్రైమ్‌బ్యూరో: ట్రావెల్ ఏజెన్సీ పేరిట నకిలీ పాస్‌పోర్టు, వీసాలను తయారు చేస్తున్న పాత నేరస్థుణ్ని టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. అడిషనల్ డీసీపీ చక్రవర్తి గుమ్మి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్ కాలాపత్తర్ బిలాల్‌నగర్‌కు చెందిన సికిందర్‌న్ గతంలో వీడియో గ్రాఫర్‌గా పనిచేశాడు. ఉద్యోగం నిమిత్తం 2012లో దుబాయ్ వెళ్లి ఏడాది పాటు ఉన్నాడు. ఈ సమయంలో ఇతర దేశాలకు వెళ్లేందుకు ప్రాసెస్ చేసే వీసా గురించి బాగా అవగాహన పెంచుకున్నాడు.

ఈజీగా డబ్బు సంపాధించేందుకు ట్రావెల్ ఏజెన్సీ నడపాలని భావించి.. నగరానికి వచ్చాక 2014లో ఎలాంటి అనుమతులు లేకుండా టూరిస్ట్, విజిటింగ్, జాబ్ పర్పస్ కోసం పలువురిని ఇతర దేశాలకు పంపడం ప్రారంభించాడు. ఆశావహుల నుంచి భారీ మొత్తంలో డబ్బు వసూలు చేసేవాడు. దీంతో వీసా మోసాలపై 4సార్లు అరెస్టై జైలుకెళ్లాడు. బయటకు వచ్చిన తర్వాత కూడా ఎలాంటి మార్పు రాకపోవడంతో మళ్ళీ నిరుద్యోగ యువతను మోసం చేయడం ప్రారంభించాడు. పలువురి నుంచి రూ.50 నుంచి 70వేల వరకూ వసూలు చేసినట్టుగా కాలాపత్తర్ పీఎస్‌లో 2కేసులు, చాంద్రాయణగుట్టలో ఓ కేసు నమోదు అయ్యింది. అరెస్టైన నిందితుడి నుంచి 4 ఫేక్ ఇండియన్ పాస్ పోర్టులు, వీసా పత్రాలతో పాటు ఇతర జాబ్ కోసం తయారు చేసిన పత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Tags:    

Similar News