కరోనాకు తమ్ముడు… హంటా వైరస్ లక్షణాలు
దిశ, వెబ్‌డెస్క్: చైనాలో కరోనా వైరస్ తాకిడి తగ్గుముఖం పడుతోందో లేదో మరో వైరస్ తెరమీదికి వచ్చింది. దాని పేరు హంటా వైరస్. ఈ వైరస్ బారిన ఇప్పటికే ఒకరు చనిపోగా 32 మందికి పాజిటివ్ వచ్చినట్లు తెలిసింది. అయితే కరోనా వైరస్ దాడి నుంచి తేరుకోనక ముందే ఇలా మరో వైరస్ వెలుగులోకి రావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కానీ ఈ వైరస్ గురించి పూర్తి విషయాలు తెలుసుకుని సరైన జాగ్రత్తలు తీసుకోగలిగితే ఎలాంటి కంగారు […]
దిశ, వెబ్‌డెస్క్:
చైనాలో కరోనా వైరస్ తాకిడి తగ్గుముఖం పడుతోందో లేదో మరో వైరస్ తెరమీదికి వచ్చింది. దాని పేరు హంటా వైరస్. ఈ వైరస్ బారిన ఇప్పటికే ఒకరు చనిపోగా 32 మందికి పాజిటివ్ వచ్చినట్లు తెలిసింది. అయితే కరోనా వైరస్ దాడి నుంచి తేరుకోనక ముందే ఇలా మరో వైరస్ వెలుగులోకి రావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కానీ ఈ వైరస్ గురించి పూర్తి విషయాలు తెలుసుకుని సరైన జాగ్రత్తలు తీసుకోగలిగితే ఎలాంటి కంగారు పడాల్సిన అవసరం ఉండదు.
హంటా వైరస్ ద్వారా హంటావైరస్ పుల్మనరీ సిండ్రోమ్ వ్యాధి వస్తుంది. ఇది ఎలుకల ద్వారా వ్యాప్తి చెందుతుంది. సీడీసీ వెల్లడించిన సమాచారం ప్రకారం హంటా వైరస్ ఒక్కో రకం ఒక్కో జాతి ఎలుకల ద్వారా వ్యాపిస్తుంది. ముఖ్యంగా మలం, మూత్రం, సలైవా అలాగే కొన్ని సార్లు ఎలుక కరవడం ద్వారా ఇది సంక్రమిస్తుంది. ఈ వైరస్ కొత్తగా వెలుగులోకి వచ్చింది కాదు. గతంలో 2008లో భారతదేశంలో పాములు, ఎలుకలు పట్టుకుని జీవించే వారిలో ఈ వైరస్ ప్రభావం కనిపించింది. అలాగే 2016లో ముంబైలో 12 ఏళ్ల బాలుడు హంటా వైరస్ కారణంగా చనిపోయాడు.
ఈ వైరస్ సోకిన తర్వాత ఒకటి నుంచి ఎనిమిది వారాల్లో లక్షణాలు బయటపడతాయి. జ్వరంతో మొదలై అలసట, కండరాల నొప్పులు, తలనొప్పి, కడుపు నొప్పి, వాంతులు, డయేరియా వంటి లక్షణాలు కనిపిస్తాయి. చివరి దశలో ఊపిరితిత్తుల్లో నీరు చేరడం, శ్వాస తీసుకోవడం తీవ్ర ఇబ్బంది ఏర్పడుతుంది.
ఈ వైరస్ మరణాల రేటు కరోనా కంటే ఎక్కువ ఉండనుందని సీడీసీ ప్రకటించింది. దీని ఫాటాలిటీ రేటు 38 శాతంగా సీడీసీ గుర్తించింది. ఈ వ్యాధికి ఇప్పటి వరకు కచ్చితమైన ట్రీట్‌మెంట్ లేదు. జలుబు లక్షణాలతో సామీప్యం ఉండటంతో హంటా వైరస్ సిండ్రోమ్ లక్షణాలను మొదటి దశలో గుర్తించడం కష్టంగా మారింది. దీన్ని దరిచేరకుండా ఉండటానికి వీలైనంత మేరకు ఎలుకలను దగ్గరకు రానివ్వద్దు.
Tags: Hanta Virus, China, Wuhan, Corona, COVID 19, Rodents, mice, rat, no treatment