పద్మారావు కంగ్రాట్స్.. సిద్దిపేట కమిషనర్ ప్రశంస

దిశ సిద్దిపేట: హెడ్ కానిస్టేబుల్ పద్మారావును కమిషన్ జోయెల్ డేవిస్ అభినందంచారు. సిద్దిపేట పోలీస్ కమిషనరేట్‌లో ఎస్‌బీ హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న జి.పద్మారావు బుధవారం ఏఎస్ఐగా పదోన్నతి పొందారు. ఈ సందర్బంగా ఏఎస్ఐ చిహ్నం, ఒక నక్షత్రాన్ని పద్మారావుకు పోలీస్ కమిషనర్ జోయెల్ డేవిస్ అందజేసి పదోన్నతి పొందినందుకు అభినందించారు. అనంతరం కమిషనర్ మాట్లాడుతూ.. పదోన్నతులు జీవన శైలిని మార్చేవిధంగా ఉత్సాహాన్ని కలిగిస్తాయని, నూతన బాధ్యతలు పెంచుతాయన్నారు. పదోన్నతి వల్ల వచ్చిన బాధ్యతల్ని మానవీయ కోణంలో […]

Update: 2021-09-22 03:44 GMT
Constable Padmarao
  • whatsapp icon

దిశ సిద్దిపేట: హెడ్ కానిస్టేబుల్ పద్మారావును కమిషన్ జోయెల్ డేవిస్ అభినందంచారు. సిద్దిపేట పోలీస్ కమిషనరేట్‌లో ఎస్‌బీ హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న జి.పద్మారావు బుధవారం ఏఎస్ఐగా పదోన్నతి పొందారు. ఈ సందర్బంగా ఏఎస్ఐ చిహ్నం, ఒక నక్షత్రాన్ని పద్మారావుకు పోలీస్ కమిషనర్ జోయెల్ డేవిస్ అందజేసి పదోన్నతి పొందినందుకు అభినందించారు. అనంతరం కమిషనర్ మాట్లాడుతూ.. పదోన్నతులు జీవన శైలిని మార్చేవిధంగా ఉత్సాహాన్ని కలిగిస్తాయని, నూతన బాధ్యతలు పెంచుతాయన్నారు. పదోన్నతి వల్ల వచ్చిన బాధ్యతల్ని మానవీయ కోణంలో నిజాయితీగా నిర్వహిస్తూ డిపార్ట్ మెంట్‌కు మంచిపేరు తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌బీ ఏసీపీ రవీందర్ రాజు, ఎస్‌బీ ఇన్స్‌స్పెక్టర్ క్రాంతి కుమార్, ఎస్‌బీ సిబ్బంది, పద్మారావు కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News