పదో తరగతి పరీక్షలకు సర్వం సన్నద్ధం
దిశ, మెదక్: పదో తరగతి పరీక్షల నిర్వహణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని మండల విద్యాధికారులను సిద్దిపేట జిల్లా కలెక్టర్ పి.వెంకట్రామిరెడ్డి ఆదేశించారు. కలెక్టరేట్‌లో శనివారం పదో తరగతి పరీక్షల నిర్వహణపై హైపవర్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జూన్ 8 నుంచి పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో పరీక్షలు సజావుగా జరిగేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. సిద్దిపేట జిల్లాలో గతంలో 71 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా, ప్రస్తుతం అదనంగా మరో […]
దిశ, మెదక్: పదో తరగతి పరీక్షల నిర్వహణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని మండల విద్యాధికారులను సిద్దిపేట జిల్లా కలెక్టర్ పి.వెంకట్రామిరెడ్డి ఆదేశించారు. కలెక్టరేట్‌లో శనివారం పదో తరగతి పరీక్షల నిర్వహణపై హైపవర్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జూన్ 8 నుంచి పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో పరీక్షలు సజావుగా జరిగేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. సిద్దిపేట జిల్లాలో గతంలో 71 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా, ప్రస్తుతం అదనంగా మరో 70 కేంద్రాలను ఏర్పాటు చేశామని డీఈఓ రవికాంత్ వివరించారు.
అనంతరం చింతమడక, సీతారాంపల్లి, మాచాపూర్, దమ్మచెరువు, అంకంపేట గ్రామ ప్రజాప్రతినిధులతో గ్రామ పునర్నిర్మాణ ప్రగతి పనులపై కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. దసరాలోపు గృహ ప్రవేశాలు జరిగేలా లక్ష్యాన్ని నిర్దేశించుకుని పనిచేయాలని ప్రజాప్రతినిధులను కలెక్టర్ కోరారు. జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల కాల్వల నిర్మాణం కోసం భూసేకరణ వేగవంతం చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. పొరపాట్లకు తావివ్వకుండా రెవెన్యూ భూ రికార్డులను ఆప్‌డేట్ చేయాలని రెవెన్యూ సిబ్బందిని కలెక్టర్ ఆదేశించారు.