కార్పొరేట్ సంస్థలకు బీజేపీ ఊడిగం.. వ్యవసాయ కమిటీ చైర్మన్ ఫైర్..

దిశ సిద్దిపేట: ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేసి కార్పొరేట్ సంస్థలకు లాభం చేకూర్చడానికి కేంద్ర ప్రభుత్వం శ్రమిస్తోందని సిద్దిపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాల సాయిరాం మండిపడ్డారు. సిద్దిపేట జిల్లాలోని మంత్రి హరీష్ రావు నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీఆర్ఎస్ నాయకులతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 70 సంవత్సరాల స్వతంత్ర భారత దేశంలో ఎన్నడూ లేని విధంగా  గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను బీజేపీనే పెంచుతుందని […]

Update: 2021-12-03 11:01 GMT

దిశ సిద్దిపేట: ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేసి కార్పొరేట్ సంస్థలకు లాభం చేకూర్చడానికి కేంద్ర ప్రభుత్వం శ్రమిస్తోందని సిద్దిపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాల సాయిరాం మండిపడ్డారు. సిద్దిపేట జిల్లాలోని మంత్రి హరీష్ రావు నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీఆర్ఎస్ నాయకులతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 70 సంవత్సరాల స్వతంత్ర భారత దేశంలో ఎన్నడూ లేని విధంగా గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను బీజేపీనే పెంచుతుందని ఆరోపించారు.

దేశ అభివృద్ధి, సంక్షేమాన్ని పక్కకు పెట్టి మతం ముసుగులో ఓట్లు దండుకోవడానికి బీజేపీ ప్రయత్నిస్తుందని దుయ్యబట్టారు. నిత్యావసర వస్తువుల ధరలు సామాన్యునికి అందుబాటులో లేకుండా పెరగడానికి కారణం బీజేపీ ప్రభుత్వం కాదా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా పెట్రోల్, డీజిల్ ,గ్యాస్ ధరలతో పాటు నిత్యావసర సరుకుల ధరలు తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Tags:    

Similar News