ఏపీ ప్రభుత్వ తీరుపై స్టార్ హీరో ఫైర్.. ట్వీట్ వైరల్
దిశ, సినిమా: సినిమా టికెట్ రేట్ల విషయంలో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తీరుపై హీరో సిద్ధార్థ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం కావాలనే సినీ ఇండస్ట్రీని టార్గెట్ చేస్తుందని, #SaveCinema హ్యాష్ ట్యాగ్‌తో ట్వీట్ చేశాడు. ఏసీ రెస్టారెంట్లలో ప్లేట్ ఇడ్లీ లేదా కాఫీకి ఎంత వసూలు చేయాలో ఎప్పుడూ అడగని ప్రభుత్వాలు.. సినిమా పరిశ్రమను నిరంతరం సమస్యాత్మక ప్రాంతంగా ఎందుకు చూడాలని ప్రశ్నించాడు. టికెట్ రేట్లు, షోల సంఖ్యపై పరిమితులకు సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వులు MRTP […]
దిశ, సినిమా: సినిమా టికెట్ రేట్ల విషయంలో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తీరుపై హీరో సిద్ధార్థ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం కావాలనే సినీ ఇండస్ట్రీని టార్గెట్ చేస్తుందని, #SaveCinema హ్యాష్ ట్యాగ్‌తో ట్వీట్ చేశాడు. ఏసీ రెస్టారెంట్లలో ప్లేట్ ఇడ్లీ లేదా కాఫీకి ఎంత వసూలు చేయాలో ఎప్పుడూ అడగని ప్రభుత్వాలు.. సినిమా పరిశ్రమను నిరంతరం సమస్యాత్మక ప్రాంతంగా ఎందుకు చూడాలని ప్రశ్నించాడు. టికెట్ రేట్లు, షోల సంఖ్యపై పరిమితులకు సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వులు MRTP చట్టాన్ని ఉల్లంఘించడమేనని అభిప్రాయపడ్డారు.
దయచేసి సినిమా హాళ్లు బతికే అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేసిన ఆయన.. ‘సినిమా టికెట్లు, పార్కింగ్ రేట్లపై రాజకీయ నాయకులు, గవర్నమెంట్‌కు ఎలాంటి అధికారం లేదు. మద్యం, పొగాకు కు ఎక్కువ ప్రధాన్యతను ఇచ్చే మీరు సినిమా పట్ల ఎందుకిలా వివక్ష చూపుతున్నారు. ప్లీజ్ ఈ దురాచారాన్ని ఆపండి. ఎంతోమంది సినీ పరిశ్రమనే నమ్ముకుని బతుకుతున్నారు. పన్నులు, సెన్సార్ విషయంలో మేము మీ రూల్స్ పాటిస్తాం. కానీ సినిమాను నమ్ముకొని బతికే వాళ్లకు జీవనోపాధి లేకుండా చేయకండి. మీకు డబ్బులే కావాలనుకుంటే ఎంతో మంది సంపన్నులున్నారు, వాళ్ల నుంచి తీసుకోండి’ అని సూచించాడు సిద్ధార్థ్.
You don't tell an a/c restaurant how much to charge for a plate of idli or a coffee. Why is it that the film industry has to constantly be seen as a problem area by govts intent on telling them how to recover their investment?
— Siddharth (@Actor_Siddharth) December 2, 2021