చెత్తకుప్పలో ‘చిన్నారి’.. SI సాహసానికి ‘సెల్యూట్’
దిశప్రతినిధి, మహబూబ్ నగర్ : అప్పుడే పుట్టిన చిన్నారిని జన్మనిచ్చిన తల్లి డంపింగ్ యార్డ్‌లో పడవేయగా విషయం తెలుసుకున్న నాగర్ కర్నూల్ ఎస్‌ఐ విజయ్ కుమార్ ఆ పసికందు ప్రాణాలను రక్షించారు. ఆదివారం ఉదయం డంపింగ్ యార్డులో పసికందు ఏడుపులు వినిపిస్తుండగా స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. ఎస్ఐ విజయ్ కుమార్ వెంటనే ఘటనా స్థలికి చేరుకుని పసికందును స్వయంగా చేతిలోకి తీసుకుని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. వైద్యులు వెంటనే స్పందించి వైద్య సేవలు అందించడంతో పసికందుకు ప్రాణాపాయం […]
దిశప్రతినిధి, మహబూబ్ నగర్ : అప్పుడే పుట్టిన చిన్నారిని జన్మనిచ్చిన తల్లి డంపింగ్ యార్డ్‌లో పడవేయగా విషయం తెలుసుకున్న నాగర్ కర్నూల్ ఎస్‌ఐ విజయ్ కుమార్ ఆ పసికందు ప్రాణాలను రక్షించారు. ఆదివారం ఉదయం డంపింగ్ యార్డులో పసికందు ఏడుపులు వినిపిస్తుండగా స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. ఎస్ఐ విజయ్ కుమార్ వెంటనే ఘటనా స్థలికి చేరుకుని పసికందును స్వయంగా చేతిలోకి తీసుకుని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.
వైద్యులు వెంటనే స్పందించి వైద్య సేవలు అందించడంతో పసికందుకు ప్రాణాపాయం తప్పింది. ఎస్‌ఐ విజయ్ కుమార్ పసికందు ప్రాణాలను కాపాడే విషయంలో స్పందించిన తీరు అందరి మనసులను దోచుకున్నది. ప్రస్తుతం ఈ వీడియో ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా, దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ విజయ్ కుమార్ తెలిపారు.