SI శివకృష్ణ లీలలు అన్నీ ఇన్ని కావయా..

దిశ ప్రతినిధి, కరీంనగర్ : జగిత్యాల జిల్లా కేంద్రంలో రెండు రోజుల కిందట ఏసీబీ అధికారులు రెడ్ హ్యండెడ్‌గా పట్టుకున్న ఎస్సై శివకృష్ణ లీలలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. చట్టాన్ని పరిరక్షించాల్సిన ఎస్సై అవినీతికి పాల్పడుతూ సామాన్యుల జీవితాలతో చెలగాటమాడినట్టు బాధితులు ఆరోపిస్తున్నారు. బాధితులంతా ఒకే చోటకు చేరాలన్న లక్ష్యంగా ఇప్పుడు ఎస్సై శివకృష్ణ బాధితుల పేరిట వాట్సాప్ గ్రూపునే క్రియేట్ చేశారు. కొడిమ్యాలకు చెందిన గంగాధర్ అనే వ్యక్తిపై 498ఏ సెక్షన్‌ కింద కేసు నమోదు […]

Update: 2021-06-19 11:10 GMT

దిశ ప్రతినిధి, కరీంనగర్ : జగిత్యాల జిల్లా కేంద్రంలో రెండు రోజుల కిందట ఏసీబీ అధికారులు రెడ్ హ్యండెడ్‌గా పట్టుకున్న ఎస్సై శివకృష్ణ లీలలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. చట్టాన్ని పరిరక్షించాల్సిన ఎస్సై అవినీతికి పాల్పడుతూ సామాన్యుల జీవితాలతో చెలగాటమాడినట్టు బాధితులు ఆరోపిస్తున్నారు. బాధితులంతా ఒకే చోటకు చేరాలన్న లక్ష్యంగా ఇప్పుడు ఎస్సై శివకృష్ణ బాధితుల పేరిట వాట్సాప్ గ్రూపునే క్రియేట్ చేశారు. కొడిమ్యాలకు చెందిన గంగాధర్ అనే వ్యక్తిపై 498ఏ సెక్షన్‌ కింద కేసు నమోదు చేసిన ఎస్సై ముందుగా రూ.60వేలు డిమాండ్ చేసి అక్రమంగా కస్టడీలో పెట్టుకున్నాడని ఆరోపించారు.

ఉపాధి కోసం కువైట్ వెళ్లి జీవనం సాగిస్తున్న తాను 2017లో సెలవుపై స్వగ్రామానికి వచ్చానని వివరించాడు. చివరకు రూ.30 వేలు తీసుకున్న ఎస్సై తన పాస్‌పోర్ట్ ఇస్తానని చెప్పి మోసం చేశాడని గంగాధర్ ఆరోపించాడు. తీరా పాస్ పోర్టును కూడా కోర్టులో డిపాజిట్ చేసిన శివకృష్ణ.. తన డబ్బులు ఇవ్వాలని అడిగితే తప్పుడు కేసులు బనాయించి బెయిల్ రాకుండా చూస్తానని బెదిరించాడని గంగాధర్ ఆరోపించారు. ఈ క్రమంలోనే గురువారం లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్సై శివ కృష్ణపై బాధితులు ఏకంగా వాట్సప్ గ్రూపునే ఏర్పాటు చేయడం గమనార్హం.

Tags:    

Similar News