మానసిక సమస్యతో బాధ పడుతున్న శ్వేత బసు
శ్వేతా బసు ప్రసాద్… కొత్త బంగారులోకం సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ ఒక్క సినిమాతోనే ఎక్కడ లేని గుర్తింపు తెచ్చుకుంది. కానీ తర్వాత చేసిన సినిమాలు అన్నీ కూడా నిరాశ పరిచాయి. దీంతో హీరోయిన్ గా అవకాశాలు తగ్గిపోయాయి. చేసేదేమీ లేక మళ్లీ హిందీ సీరియల్స్ నమ్ముకుని… అదే కంటిన్యూ చేస్తోంది. కెరియర్ పరంగా ఇప్పుడు పరవాలేదు కానీ… వ్యక్తిగత జీవితంలో మాత్రం చాలా ఒత్తిడికి గురయిందట శ్వేత. రోహిత్ తో పెళ్లి చేసుకుని కొన్ని […]
శ్వేతా బసు ప్రసాద్… కొత్త బంగారులోకం సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ ఒక్క సినిమాతోనే ఎక్కడ లేని గుర్తింపు తెచ్చుకుంది. కానీ తర్వాత చేసిన సినిమాలు అన్నీ కూడా నిరాశ పరిచాయి. దీంతో హీరోయిన్ గా అవకాశాలు తగ్గిపోయాయి. చేసేదేమీ లేక మళ్లీ హిందీ సీరియల్స్ నమ్ముకుని… అదే కంటిన్యూ చేస్తోంది. కెరియర్ పరంగా ఇప్పుడు పరవాలేదు కానీ… వ్యక్తిగత జీవితంలో మాత్రం చాలా ఒత్తిడికి గురయిందట శ్వేత. రోహిత్ తో పెళ్లి చేసుకుని కొన్ని రోజులు హ్యాపీగా గడిపిన శ్వేత… గతేడాది తన నుంచి విడిపోయింది. కానీ ఆ తర్వాత అమ్మ నాన్నల దగ్గరకు కూడా వెళ్లని శ్వేత ఒంటరిగా జీవిస్తోందట.
అయితే కరోనా కారణంగా సినిమాలు, సీరియళ్లు షూటింగ్ వాయిదా పడడం తో ఇంటికే పరిమితం అయింది. లాక్ డౌన్ కారణంగా ఇన్ని రోజులు ఒక్కతే ఇంట్లో ఉండడం… అమ్మానాన్న, మాజీ భర్త గురించి, తన భవిష్యత్తు గురించి ఆలోచించడంతో డిప్రెషన్ లోకి వెళ్లిందట శ్వేత. దీంతో డాక్టర్ తో వీడియో కాల్ మాట్లాడి తన మానసిక సమస్యను వివరించగా… ఎలా సమస్య నుంచి అధిగమించవచ్చు అనేది సూచించార ట. ప్రస్తుతం సైకియాట్రిస్ట్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నట్లు తెలిపింది. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు తప్పకుండా డాక్టర్ ను సంప్రదించాలి అని… మానసిక సమస్యలతో డాక్టర్ దగ్గరికి వెళ్లడాన్ని చులకనగా చూడాల్సిన అవసరం లేదని తెలిపింది. గతంలో బాలీవుడ్ దివా దీపికా పదుకొనె సైతం మానసిక సమస్యకు ట్రీట్మెంట్ తీసుకున్న విషయం తెలిసిందే.
Tags: Shwetha Basu Prasad, Tollywood, Bollywood, Treatment