‘గబ్బర్ సింగ్’ నా లైఫ్‌ను మార్చేసింది : శ్రుతి

దిశ, వెబ్‌డెస్క్: లోకనాయకుడు కమల్ హాసన్ కూతురు శృతి హాసన్ మల్టీ టాలెంటెడ్ అన్న సంగతి తెలిసిందే. చేసే పనిలోనే సంతోషాన్ని వెతుక్కోవాలి అనుకునే శ్రుతి.. నటిగా, గాయకురాలిగా, మ్యూజిక్ డైరెక్టర్‌గానూ రాణిస్తోంది. అయితే హీరోయిన్‌గా సౌత్‌తో పాటు బాలీవుడ్‌లోనూ గుర్తింపు పొందిన ఈ హీరోయిన్.. తనకు నార్త్, సౌత్ అనే బేధం లేదని చెప్తోంది. Certain Telugu publications have misinterpreted a quote from a national interview I gave and are […]

Update: 2020-10-06 00:44 GMT
‘గబ్బర్ సింగ్’ నా లైఫ్‌ను మార్చేసింది : శ్రుతి
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్:
లోకనాయకుడు కమల్ హాసన్ కూతురు శృతి హాసన్ మల్టీ టాలెంటెడ్ అన్న సంగతి తెలిసిందే. చేసే పనిలోనే సంతోషాన్ని వెతుక్కోవాలి అనుకునే శ్రుతి.. నటిగా, గాయకురాలిగా, మ్యూజిక్ డైరెక్టర్‌గానూ రాణిస్తోంది. అయితే హీరోయిన్‌గా సౌత్‌తో పాటు బాలీవుడ్‌లోనూ గుర్తింపు పొందిన ఈ హీరోయిన్.. తనకు నార్త్, సౌత్ అనే బేధం లేదని చెప్తోంది.

నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూను బేస్ చేసుకుని కొన్ని తెలుగు మీడియా సంస్థలు తన మాటలను తప్పుగా అన్వయించాయని, ఫేక్ న్యూస్ ప్రసారం చేస్తున్నాయని చెప్పింది. స్పష్టంగా చెప్పాలంటే ‘రేసు గుర్రం, గబ్బర్ సింగ్’ వంటి తెలుగు చిత్రాల్లో నటించినందుకు గర్వపడుతున్నానని.. ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో నటించిన ‘గబ్బర్ సింగ్’ చిత్రం తన లైఫ్‌ను చేంజ్ చేసిందని చెప్పింది.

తెలుగు.. సౌత్ ఇండియన్ సినిమాలో ఒక భాగం అని.. నా హృదయంలో కూడా ఒక భాగమని చెప్పింది శృతి. తను చేసిన హిందీ చిత్రాలకు అనుగుణంగా ఇంటర్వ్యూ ఇచ్చానని.. తనకు సంబంధించినంత వరకు సౌత్, నార్త్ అనే భావన ఎప్పుడూ లేదని చెప్పింది. ఇప్పటికైనా అందరికీ అన్ని విషయాలు క్లియర్ చేశాననే అనుకుంటున్నట్లుగా వెల్లడించింది.

Tags:    

Similar News