బాయ్‌ఫ్రెండ్ కాదు.. ఆ హీరోపై మనసుపడ్డ శ్రుతి హాసన్

దిశ, సినిమా : హీరోయిన్ శ్రుతి హాసన్ అభిమానులతో జరిగిన సోషల్ మీడియా కన్వర్జేషన్‌లో ఓ సీక్రెట్‌ను రివీల్ చేసింది. ట్విట్టర్‌లో ‘ఆస్క్ మి’ సెషన్ కండక్ట్ చేసిన శ్రుతి.. ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చింది. స్కూల్ టైమ్‌లో క్రష్ గురించి ఓ అభిమాని ప్రశ్నించగా.. బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్, అమెరికన్ యాక్టర్ లియోనార్డో డికాప్రియో అంటే క్రష్ ఉండేదని తెలిపింది. మరి హృతిక్‌తో సినిమా చేయాలని ఎప్పుడు అనుకోలేదా అంటే ‘ఫింగర్స్ క్రాస్డ్’.. ఇది […]

Update: 2021-04-15 06:11 GMT

దిశ, సినిమా : హీరోయిన్ శ్రుతి హాసన్ అభిమానులతో జరిగిన సోషల్ మీడియా కన్వర్జేషన్‌లో ఓ సీక్రెట్‌ను రివీల్ చేసింది. ట్విట్టర్‌లో ‘ఆస్క్ మి’ సెషన్ కండక్ట్ చేసిన శ్రుతి.. ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చింది. స్కూల్ టైమ్‌లో క్రష్ గురించి ఓ అభిమాని ప్రశ్నించగా.. బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్, అమెరికన్ యాక్టర్ లియోనార్డో డికాప్రియో అంటే క్రష్ ఉండేదని తెలిపింది. మరి హృతిక్‌తో సినిమా చేయాలని ఎప్పుడు అనుకోలేదా అంటే ‘ఫింగర్స్ క్రాస్డ్’.. ఇది భవిష్యత్తులో కచ్చితంగా జరగాలని కోరుకుంటున్నాను అని చెప్పింది. కాగా 2017లో ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో హృతిక్, శ్రుతి హీరోహీరోయిన్లుగా నటిస్తారని వార్తలు వచ్చాయి. కానీ ఇప్పటి వరకు ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు.

ఇక శ్రుతి ఫ్యూచర్‌లో డైరెక్టర్‌గా కూడా పనిచేసే ఆలోచన ఉందని క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం యాక్టింగ్‌తో పాటు మ్యూజిక్‌పై కాన్సంట్రేట్ చేస్తున్నానని.. ‘ఈనాడు’ లాంటి బెస్ట్ ఆల్బమ్ ఇచ్చేందుకు ట్రై చేస్తానని తెలిపింది. ‘లైఫ్‌లో రిగ్రెట్స్ ఏమైనా ఉన్నాయా?’ అని అడిగిన అభిమాని ప్రశ్నకు.. ‘లేదు.. కొన్ని ఉన్నాయి కానీ హానెస్ట్‌గా చెప్పాలంటే ప్రతీ అనుభవం కూడా ఒక గుణపాఠం నేర్పింది’ అని చెప్పింది.

Tags:    

Similar News