మెంటల్ ఫిట్‌నెస్ కోసమే రన్నింగ్
శృతి హాసన్ ఒంటరిగా ఉండేందుకే ఇష్టపడుతుంది. లాక్‌డౌన్ పూర్తి సమయాన్ని కూడా ఒంటరిగానే గడిపిన ఈ బ్యూటీ.. లాక్‌డౌన్ నిబంధనలకు సడలింపులివ్వగానే వెంటనే హైదరాబాద్ వచ్చేసింది. దీనికి కారణం తను ప్రతీ రోజు రన్నింగ్ చేస్తానని.. ముంబై అపార్ట్‌మెంట్ బ్యూటిఫుల్‌గా ఉన్నా కొంచెం ఇబ్బందిగా ఉంటుందని.. హైదరాబాద్‌లో ఇళ్లు చాలా విశాలంగా ఉండి రన్నింగ్‌కు అనుకూలంగా ఉంటుందని తెలిపింది. ఒక్కరోజు కూడా స్కిప్ చేయకుండా రన్నింగ్ చేసేందుకు కారణం ఫిట్‌నెస్ అని చెప్పిన శృతి.. ఇది కేవలం […]
శృతి హాసన్ ఒంటరిగా ఉండేందుకే ఇష్టపడుతుంది. లాక్‌డౌన్ పూర్తి సమయాన్ని కూడా ఒంటరిగానే గడిపిన ఈ బ్యూటీ.. లాక్‌డౌన్ నిబంధనలకు సడలింపులివ్వగానే వెంటనే హైదరాబాద్ వచ్చేసింది. దీనికి కారణం తను ప్రతీ రోజు రన్నింగ్ చేస్తానని.. ముంబై అపార్ట్‌మెంట్ బ్యూటిఫుల్‌గా ఉన్నా కొంచెం ఇబ్బందిగా ఉంటుందని.. హైదరాబాద్‌లో ఇళ్లు చాలా విశాలంగా ఉండి రన్నింగ్‌కు అనుకూలంగా ఉంటుందని తెలిపింది.
ఒక్కరోజు కూడా స్కిప్ చేయకుండా రన్నింగ్ చేసేందుకు కారణం ఫిట్‌నెస్ అని చెప్పిన శృతి.. ఇది కేవలం బాడీనే కాదు మెంటల్‌గానూ ఫిట్‌గా ఉంచుతుందని తెలిపింది. తను ఆందోళనతో బాధ పడుతున్నానని తెలిపిన శృతి.. దీన్ని అదుపులో ఉంచేందుకు రెగ్యులర్‌గా వ్యాయాయం చేస్తున్నట్లు తెలిపింది. ఇక మానసిక ఆరోగ్యం గురించి మాట్లాడటం తనకు భయంగా ఉండేదన్న లోకనాయకుడి కూతురు.. ఇలా మాట్లాడడం ద్వారా తనలోని బలహీనత ప్రపంచానికి తెలుస్తుందనే అభిప్రాయం ఉండేదని చెప్పింది. కానీ దీని గురించి అవగాహన పెంచుకునేందుకు ఇప్పుడు మాట్లాడుతున్నానని.. మన చుట్టూ కూడా మెంటల్ హెల్త్ గురించి ఉన్న భయాన్ని పోగొట్టేందుకు ప్రయత్నిస్తున్నానని తెలిపింది శృతి.