కాపీ కాదు.. ఒరిజినలే బెస్ట్ : శ్రియ
దిశ, వెబ్‌డెస్క్: బ్యూటిఫుల్ శ్రియ శరణ్ సెట్స్ మీదకు వెళ్లేందుకు ఆరాటపడుతోంది. కరోనా కారణంగా చాలా రోజులుగా ఇంటిపట్టునే ఉంటున్న భామ.. మళ్లీ షూటింగ్స్‌కు అటెండ్ అయితే బాగుండేదని కోరుకుంటోంది. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రియ.. ఎస్‌ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్’ గురించి షేర్ చేసుకుంది. ఛత్రపతి సినిమా తర్వాత మళ్లీ జక్కన్నతో పనిచేయడం చాలా సంతోషంగా ఉందని తెలిపింది. తను పర్ఫెక్ట్ విజన్ ఉన్న డైరెక్టర్ అని తెలిపిన శ్రియ.. ‘ఆర్‌ఆర్‌ఆర్’ […]
దిశ, వెబ్‌డెస్క్: బ్యూటిఫుల్ శ్రియ శరణ్ సెట్స్ మీదకు వెళ్లేందుకు ఆరాటపడుతోంది. కరోనా కారణంగా చాలా రోజులుగా ఇంటిపట్టునే ఉంటున్న భామ.. మళ్లీ షూటింగ్స్‌కు అటెండ్ అయితే బాగుండేదని కోరుకుంటోంది. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రియ.. ఎస్‌ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్’ గురించి షేర్ చేసుకుంది. ఛత్రపతి సినిమా తర్వాత మళ్లీ జక్కన్నతో పనిచేయడం చాలా సంతోషంగా ఉందని తెలిపింది. తను పర్ఫెక్ట్ విజన్ ఉన్న డైరెక్టర్ అని తెలిపిన శ్రియ.. ‘ఆర్‌ఆర్‌ఆర్’ సెట్‌లో ఉంటే ఒక గొప్ప ప్రాజెక్ట్‌లో భాగమయ్యాననే ఫీలింగ్ కలిగిందని చెప్పింది. అజయ్ దేవ్‌గన్‌కు జోడీగా నటిస్తున్న తన పాత్ర చిన్నదే అని, తనతో కలిసి వర్క్ చేయడం బాగుందని తెలిపింది. కానీ తారక్, చరణ్‌లతో కలిసి చేసే అవకాశం దక్కలేదని చెప్పింది. పరిస్థితులు చక్కబడగానే చిత్రీకరణ ప్రారంభించి, థియేటర్‌లో సినిమా రిలీజ్ చేస్తారని అభిప్రాయపడింది.
ఇక బాలీవుడ్ మూవీ ‘అంధాధున్’ తెలుగు రీమేక్ కోసం తనను సంప్రదించినట్లు తెలిపింది శ్రియ. హిందీలో టబు చేసిన పాత్రకోసం చర్చలు జరిగాయని.. ఇంకా ఫైనల్ కావాల్సి ఉందని చెప్పింది. మేర్లపాక గాంధీ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాలో నితిన్ హీరో కాగా, శ్రియ పాత్ర కీలకం కానుంది. కాగా, టబు పాత్ర తనకు రావడం గ్రేట్‌గా ఫీల్ అవుతున్నానని.. తనను ఇమిటేట్ చేయకుండా క్యారెక్టర్‌కు నా ఒరిజినల్ ఫ్లేవర్ యాడ్ చేసేందుకు ట్రై చేస్తానని తెలిపింది శ్రియ.