డోరు తీసేసరికి భార్యభర్తలు అలా కనిపించడంతో షాక్..
దిశ, దుబ్బాక : ఏమి జరిగిందో ఏమో తెలియదు గానీ.. దంపతులు ఇద్దరు ఆత్మహత్య చేసుకున్న తీవ్ర విషాదమైన ఘటన సిద్దిపేట జిల్లాలో చోటు చేసుకుంది. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం ధర్మారం గ్రామానికి చెందిన కంతుల దేవరాజు (30)కు, మమత(28)తో పన్నెండు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరికి ఎనిమిది సంవత్సరాల కుమారుడు మోక్ష వర్ధన్, ఐదు సంవత్సరాల కూతురు మనస్విత ఉన్నారు. అన్యోన్యంగా సాగుతున్న వీరి దాంపత్య జీవితంలో గత సంవత్సర కాలంగా కుటుంబ […]
దిశ, దుబ్బాక : ఏమి జరిగిందో ఏమో తెలియదు గానీ.. దంపతులు ఇద్దరు ఆత్మహత్య చేసుకున్న తీవ్ర విషాదమైన ఘటన సిద్దిపేట జిల్లాలో చోటు చేసుకుంది. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం ధర్మారం గ్రామానికి చెందిన కంతుల దేవరాజు (30)కు, మమత(28)తో పన్నెండు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరికి ఎనిమిది సంవత్సరాల కుమారుడు మోక్ష వర్ధన్, ఐదు సంవత్సరాల కూతురు మనస్విత ఉన్నారు. అన్యోన్యంగా సాగుతున్న వీరి దాంపత్య జీవితంలో గత సంవత్సర కాలంగా కుటుంబ కలహాలు, అనుమానాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో సుమారు ఆరు నెలల క్రితం భార్య భర్తల మధ్య జరిగిన గొడవకు పెద్దమనుషులు ఇద్దరిని సముదాయించినట్లు తెలుస్తోంది.
అయితే అప్పటి నుండి బాగానే ఉంటున్న దంపతులు గత రాత్రి ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. దంపతుల ఆత్మహత్యతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. ఇంట్లో ఎవరూ లేని సమయంలో దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డట్టు గ్రామస్తులు తెలిపారు. ఉదయం 10 గంటల సమయం దాటిన కూడా డోరు తెరవకపోవడంతో అనుమానం వచ్చిన గ్రామస్థులు ఇంట్లోకి వెళ్లి చూడడంతో భార్యభర్తలిద్దరు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు స్థానికులు గుర్తించారు.
ఆత్మహత్యకు పాల్పడిన విషయాన్ని గ్రహించిన గ్రామస్తులు వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. అందరితో కలుపుగోలుగా ఉండే దంపతులు ఆత్మహత్య చేసుకోవడంతో గ్రామస్తులు, కుటుంబీకులు కన్నీటిపర్యంతమయ్యారు. దంపతుల ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. తల్లిదండ్రులను కోల్పోయి బిక్కుబిక్కుమంటూ ఏడుస్తున్న చిన్నారులను చూసి అక్కడికి వచ్చినవారు కంటతడిపెట్టారు.