విద్యుత్ స్తంభం ఎక్కిన యువకుడికి షాక్.. అగ్ని కీలల్లో..

దిశ, కామారెడ్డి : విద్యుత్ స్తంభాలు మరమ్మతులు చేస్తుండగా కరెంట్ సరఫరా అయ్యి బీహార్ యువకుడు స్తంభంపైనే షాక్‌కు గురై దహనం అయ్యాడు. ఈ ఘటన రాజంపేట మండల కేంద్రంలో గురువారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం రాజంపేటలో విద్యుత్ అధికారులు మరమ్మతులు చేపట్టారు. బీహార్‌కు చెందిన కూలీలు విద్యుత్ స్తంభాలు ఎక్కి మరమ్మతులు చేస్తున్నారు. ఓ కూలి విద్యుత్ స్తంభంపై ఉండగానే ఒక్కసారిగా విద్యుత్ సరఫరా అయింది. దాంతో ఆ యువకుడు స్తంభంపైనే తలకిందులుగా […]

Update: 2021-09-30 05:41 GMT

దిశ, కామారెడ్డి : విద్యుత్ స్తంభాలు మరమ్మతులు చేస్తుండగా కరెంట్ సరఫరా అయ్యి బీహార్ యువకుడు స్తంభంపైనే షాక్‌కు గురై దహనం అయ్యాడు. ఈ ఘటన రాజంపేట మండల కేంద్రంలో గురువారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం రాజంపేటలో విద్యుత్ అధికారులు మరమ్మతులు చేపట్టారు. బీహార్‌కు చెందిన కూలీలు విద్యుత్ స్తంభాలు ఎక్కి మరమ్మతులు చేస్తున్నారు. ఓ కూలి విద్యుత్ స్తంభంపై ఉండగానే ఒక్కసారిగా విద్యుత్ సరఫరా అయింది. దాంతో ఆ యువకుడు స్తంభంపైనే తలకిందులుగా వేలాడబడ్డాడు. విద్యుత్ షాక్ తో శరీరం కాలిపోయింది. తీవ్రంగా గాయపాడిన యువకుడిని కామారెడ్డి జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ తరలించారు. అయితే విద్యుత్ అధికారుల నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. మరమ్మతులు చేస్తున్న సమయంలో విద్యుత్ సరఫరా నిలిపివేయకుండా అధికారులు నిర్లక్ష్యంగా వహించారని గ్రామస్తులు ఆరోపించారు.

Tags:    

Similar News