రైతులను ఉగ్రవాదుల్లా చూస్తున్నారు
ముంబయి: నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఆందోళనకు దిగిన రైతన్నలపట్ల కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ తీవ్ర విమర్శలు చేశారు. రైతన్నలు ఈ దేశ పౌరులే కాదన్నట్టుగా వారిని ఢిల్లీలో అడుగుపెట్టకుండా అడ్డుకుంటున్న తీరు దారుణమని అన్నారు. అన్నదాతలను ఉగ్రవాదులలాగా చూస్తున్నారని మండిపడ్డారు. పంజాబ్, హర్యానా నుంచి వచ్చిన సిక్కులు అయినందుకే వారిని ఖలీస్తానీలని పిలవడం హేయమని తెలిపారు. ఖలీస్తానీ ఉగ్రవాదులని పిలిచి రైతులను అవమానించారని అభిప్రాయపడ్డారు. అన్నదాతల ఆందోళనలను కేంద్ర సర్కారు […]
ముంబయి: నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఆందోళనకు దిగిన రైతన్నలపట్ల కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ తీవ్ర విమర్శలు చేశారు. రైతన్నలు ఈ దేశ పౌరులే కాదన్నట్టుగా వారిని ఢిల్లీలో అడుగుపెట్టకుండా అడ్డుకుంటున్న తీరు దారుణమని అన్నారు. అన్నదాతలను ఉగ్రవాదులలాగా చూస్తున్నారని మండిపడ్డారు. పంజాబ్, హర్యానా నుంచి వచ్చిన సిక్కులు అయినందుకే వారిని ఖలీస్తానీలని పిలవడం హేయమని తెలిపారు. ఖలీస్తానీ ఉగ్రవాదులని పిలిచి రైతులను అవమానించారని అభిప్రాయపడ్డారు. అన్నదాతల ఆందోళనలను కేంద్ర సర్కారు అణచివేతకు పాల్పడటంపై ఎస్‌పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్, బీఎస్‌పీ బాస్ మాయావతి మండిపడిన సంగతి తెలిసిందే.