కరోనా పోరాటంలో ఎల్లప్పుడూ సిద్ధం: గబ్బర్
దిశ, వెబ్‌డెస్క్: కరోనాపై పోరుకు క్రీడాకారులు ముందుకొస్తున్నారు. ఇటీవల విరాట్ కోహ్లీ-అనుష్క దంపతులు ఏకంగా రూ. 11 కోట్లకు పైగా విరాళాలు సేకరించి అందరికీ ఆదర్శంగా నిలిచారు. అంతకుముందు ఐపీఎల్‌లో వచ్చిన క్యాష్ ప్రైజ్‌లతో పాటు రూ. 20 లక్షలను టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ విరాళం ఇచ్చిన సంగతి తెలిసిందే. మరోసారి గబ్బర్ తనవంతుగా గురుగ్రామ్ పోలీసులకు ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను అందజేశాడు.‘నా ప్రజల కోసం కొంచెమైనా సాయం చేయడం కృతజ్ఞతగా భావిస్తున్నా.. నా ప్రజలకు, సమాజానికి […]
దిశ, వెబ్‌డెస్క్: కరోనాపై పోరుకు క్రీడాకారులు ముందుకొస్తున్నారు. ఇటీవల విరాట్ కోహ్లీ-అనుష్క దంపతులు ఏకంగా రూ. 11 కోట్లకు పైగా విరాళాలు సేకరించి అందరికీ ఆదర్శంగా నిలిచారు. అంతకుముందు ఐపీఎల్‌లో వచ్చిన క్యాష్ ప్రైజ్‌లతో పాటు రూ. 20 లక్షలను టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ విరాళం ఇచ్చిన సంగతి తెలిసిందే. మరోసారి గబ్బర్ తనవంతుగా గురుగ్రామ్ పోలీసులకు ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను అందజేశాడు.‘నా ప్రజల కోసం కొంచెమైనా సాయం చేయడం కృతజ్ఞతగా భావిస్తున్నా.. నా ప్రజలకు, సమాజానికి సహాయం చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటా.. ఈ మహమ్మారి నుంచి భారత్ త్వరలోనే కోలుకుంటుంది’ అంటూ ట్వీట్ చేశాడు ధావన్. దీంతో గురుగ్రామ్ పోలీసులు ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను అందజేసిన ధావన్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ రీట్వీట్ చేశారు.