టీం ఇండియా జట్టు కెప్టెన్‌గా శిఖర్ ధావన్..
దిశ, వెబ్‌డెస్క్ : ఐపీఎల్( ఇండియన్ ప్రీమియర్ లీగ్) వాయిదా పడటంతో బీసీసీఐ బోర్డు అంతర్జాతీయ టోర్నీలపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే తొలుత ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్ ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. కెప్టెన్ విరాట్ కోహ్లీ బృందం ఇప్పటికే బ్రిటన్ చేరుకుంది. అంతలోనే శ్రీలంకతో మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌లకు సంబంధించిన షెడ్యూల్‌ను BCCI గురువారం రిలీజ్ చేసింది. జులై 13 నుంచి 25 వరకు ఈ టోర్నీ జరగనున్నట్లు పేర్కొంది. […]
దిశ, వెబ్‌డెస్క్ : ఐపీఎల్( ఇండియన్ ప్రీమియర్ లీగ్) వాయిదా పడటంతో బీసీసీఐ బోర్డు అంతర్జాతీయ టోర్నీలపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే తొలుత ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్ ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. కెప్టెన్ విరాట్ కోహ్లీ బృందం ఇప్పటికే బ్రిటన్ చేరుకుంది. అంతలోనే శ్రీలంకతో మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌లకు సంబంధించిన షెడ్యూల్‌ను BCCI గురువారం రిలీజ్ చేసింది. జులై 13 నుంచి 25 వరకు ఈ టోర్నీ జరగనున్నట్లు పేర్కొంది.
అయితే, శ్రీలంకతో జరగనున్న మ్యాచులకు శిఖర్ ధావన్ కెప్టెన్‌గా, భువనేశ్వర్ కుమార్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. విరాట్ కోహ్లీ బృందం ఇంగ్లాండ్ టూర్ నేపథ్యంలో ధావన్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించినట్లు బీసీసీఐ వెల్లడించింది. శ్రీలంకతో జరిగే టోర్నీలో ఇండియా జట్టులో పృథ్వీషా, పడిక్కల్, గౌక్వాడ్, సూర్యకుమార్, మనీష్ పాండే, హార్దిక్ పాండ్యా, నితీశ్ రాణా, ఇషాన్ కిషన్, సంజు శాంసన్, చాహల్, ఆర్ చాహర్, గౌతమ్, కృనాల్ పాండ్యా, కుల్‌దీప్, చక్రవర్తి, డి. చాహర్, సైనీ సకారియాలు చోటుదక్కించుకున్నారు.