షెర్లిన్ పేరు గూగుల్ చేస్తే చాలు.. పోర్న్ వీడియోస్ ప్రత్యక్షం!

దిశ, సినిమా : అశ్లీల వెబ్‌సైట్ కోసం అడల్ట్ కంటెంట్ సృష్టించినందుకు గాను షెర్లిన్ చోప్రాపై కేసు నమోదైంది. రిటైర్డ్ కస్టమ్స్, సెంట్రల్ ఎక్సైజ్ అధికారి మధుకర్ కేని సైబర్ సెల్‌కు ఫిర్యాదు చేయగా.. దీనిపై దర్యాప్తు చేసిన పోలీసులు పలు ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్, ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ షెర్లిన్ అశ్లీల వీడియోలను పోస్టుచేస్తున్నట్టు నిర్ధారణకు వచ్చారు. గూగుల్‌లో షెర్లిన్ చోప్రా పేరు టైప్ చేస్తే తెరపై అశ్లీల వీడియోలు కనిపిస్తున్నాయని ఆరోపించిన ఆయన.. ఈ వీడియోలను డౌన్‌లోడ్ […]

Update: 2021-02-19 05:21 GMT

దిశ, సినిమా : అశ్లీల వెబ్‌సైట్ కోసం అడల్ట్ కంటెంట్ సృష్టించినందుకు గాను షెర్లిన్ చోప్రాపై కేసు నమోదైంది. రిటైర్డ్ కస్టమ్స్, సెంట్రల్ ఎక్సైజ్ అధికారి మధుకర్ కేని సైబర్ సెల్‌కు ఫిర్యాదు చేయగా.. దీనిపై దర్యాప్తు చేసిన పోలీసులు పలు ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్, ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ షెర్లిన్ అశ్లీల వీడియోలను పోస్టుచేస్తున్నట్టు నిర్ధారణకు వచ్చారు. గూగుల్‌లో షెర్లిన్ చోప్రా పేరు టైప్ చేస్తే తెరపై అశ్లీల వీడియోలు కనిపిస్తున్నాయని ఆరోపించిన ఆయన.. ఈ వీడియోలను డౌన్‌లోడ్ చేసి పెన్ డ్రైవ్‌లో పోలీసులకు అందించాడు.

కాగా ఈ కేసులో షెర్లిన్ చోప్రా ముందస్తు బెయిల్‌కు దరఖాస్తు చేయగా ముంబై సెషన్ కోర్టు తిరస్కరించింది. దీంతో అరెస్ట్ నుంచి ప్రొటెక్షన్ కల్పించాలంటూ ముంబై హై కోర్టును ఆశ్రయించింది షెర్లిన్. ఫిబ్రవరి 22న ఈ పిటిషన్ విచారణకు రానుండగా.. సోమవారం వరకు నటిని అరెస్ట్ చేయబోమని ముంబై పోలీసులు స్పష్టం చేశారు. కాగా షెర్లిన్ తన పిటిషన్‌లో తాను పైరసీ బాధితురాలినని పేర్కొంది. సబ్‌స్క్రిప్షన్ బేస్డ్ ఇంటర్నేషనల్ వెబ్‌సైట్ కోసం కంటెంట్ రెడీ చేయగా.. అది కాస్తా లీకైందని, ఈ క్రమంలోనే పలు పోర్న్ వెబ్‌సైట్స్‌లో అప్‌లోడ్ అయిందని తెలిపింది. దీనితో తనకు ఎలాంటి సంబంధం లేదని, తనకు బెయిల్ ఇప్పించాలని కోరింది.

Tags:    

Similar News