త్వరలో టీఎంసీలోకి శత్రుఘ్న సిన్హా

కోల్‌కత: ప్రముఖ కాంగ్రెస్ నేత, మాజీ బీజేపీ ఎంపీ శత్రుఘ్న సిన్హా త్వరలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ(టీఎంసీ)లో చేరబోతున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే ఆయన టీఎంసీ అధ్యక్షురాలు, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీని కలవనున్నట్టు ఆయన సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. కాగా ఇదే విషయమై ఆయనను మీడియా ప్రశ్నించింది. దీనికి ఆయన ‘పాలిటిక్స్ అనేవి ఆర్ట్ ఆఫ్ పాజిబిలిటీ’ అని పరోక్షంగా బదులిచ్చారు. ఇక టీఎంసీ పార్టీతో ఆయన చర్చలు అడ్వాన్స్ స్టేజిలో ఉన్నట్టు ఆయన సన్నిహితులు తెలిపారు. […]

Update: 2021-07-12 11:15 GMT
Shatrughan Sinha
  • whatsapp icon

కోల్‌కత: ప్రముఖ కాంగ్రెస్ నేత, మాజీ బీజేపీ ఎంపీ శత్రుఘ్న సిన్హా త్వరలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ(టీఎంసీ)లో చేరబోతున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే ఆయన టీఎంసీ అధ్యక్షురాలు, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీని కలవనున్నట్టు ఆయన సన్నిహిత వర్గాలు వెల్లడించాయి.

కాగా ఇదే విషయమై ఆయనను మీడియా ప్రశ్నించింది. దీనికి ఆయన ‘పాలిటిక్స్ అనేవి ఆర్ట్ ఆఫ్ పాజిబిలిటీ’ అని పరోక్షంగా బదులిచ్చారు. ఇక టీఎంసీ పార్టీతో ఆయన చర్చలు అడ్వాన్స్ స్టేజిలో ఉన్నట్టు ఆయన సన్నిహితులు తెలిపారు. జూలై 21న బెంగాల్‌లో నిర్వహించే అమర వీరుల దినోత్సవం(1993 కోల్‌కత కాల్పుల్లో అమరుల గుర్తుగా)లో ఆయన పార్టీలో చేరే అవకాశాలు ఉన్నట్టు సన్నిహితులు చెబుతున్నారు.

Tags:    

Similar News