నిలకడగా శశికళ ఆరోగ్యం..
బెంగళూరు : ఏఐఏడీఎంకే మాజీ నేత వీకే శశికళ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. బుధవారం సాయంత్రం తీవ్ర అనారోగ్యానికి గురికావడంతో ఆమెను బౌరింగ్ అండ్ లేడీ కర్జన్ హాస్పిటల్‌కు తరలించారు. శశికళ తీవ్ర శ్వాసకోశ సమస్య బాధపడుతున్నారని, ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని హాస్పిటల్ డీన్ హెచ్‌వీ మనోజ్ కుమార్ తెలిపారు. రెండు, మూడు రోజుల్లో ఆమెను డిశ్చార్జ్ చేస్తామన్నారు. తీవ్ర జ్వరం, దగ్గు, శ్వాస సమస్యలతో శశికళ హాస్పిటల్‌లో […]
బెంగళూరు : ఏఐఏడీఎంకే మాజీ నేత వీకే శశికళ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. బుధవారం సాయంత్రం తీవ్ర అనారోగ్యానికి గురికావడంతో ఆమెను బౌరింగ్ అండ్ లేడీ కర్జన్ హాస్పిటల్‌కు తరలించారు. శశికళ తీవ్ర శ్వాసకోశ సమస్య బాధపడుతున్నారని, ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని హాస్పిటల్ డీన్ హెచ్‌వీ మనోజ్ కుమార్ తెలిపారు.
రెండు, మూడు రోజుల్లో ఆమెను డిశ్చార్జ్ చేస్తామన్నారు. తీవ్ర జ్వరం, దగ్గు, శ్వాస సమస్యలతో శశికళ హాస్పిటల్‌లో చేరారని, ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు. ఆమె సెవర్ అక్యుట్ రెస్పిరేటరీ ఇల్‌నెస్(ఎస్ఏఆర్ఐ)తో బాధపడుతున్నారని, కానీ, ఆర్‌టీపీసీఆర్ పరీక్షలో కరోనా నెగెటివ్ వచ్చిందని డాక్టర్ మనోజ్ కుమార్ పేర్కొన్నారు.