మదర్స్ డే సందర్భంగా బీటౌన్ తల్లీకూతుళ్ల ఫండ్ రైజింగ్
దిశ, సినిమా: మదర్స్ డే సందర్భంగా బాలీవుడ్ తల్లీకూతుళ్లు షర్మిళ ఠాగూర్, సోహా అలీఖాన్ కలిసి వర్చువల్ చారిటీ ఈవెంట్ నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. జంతు సంరక్షణ నిమిత్తం నిర్వహించనున్న పాప్ అప్ చారిటీ సేల్‌లో తమ పర్సనల్ క్లోసెట్స్(వార్డ్ రోబ్ ఐటమ్స్) వేలం వేయనున్నారు. కాగా,విరాళాల సేకరణకు ఇది సరైన పద్ధతి అని చెప్పిన సోహా.. ఇందులో పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన ప్రయత్నం కూడా ఉందని వెల్లడించింది. ఈ మేరకు సేకరించిన విరాళాలన్నీ పటౌడీ ట్రస్ట్‌తో పాటు […]
దిశ, సినిమా: మదర్స్ డే సందర్భంగా బాలీవుడ్ తల్లీకూతుళ్లు షర్మిళ ఠాగూర్, సోహా అలీఖాన్ కలిసి వర్చువల్ చారిటీ ఈవెంట్ నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. జంతు సంరక్షణ నిమిత్తం నిర్వహించనున్న పాప్ అప్ చారిటీ సేల్‌లో తమ పర్సనల్ క్లోసెట్స్(వార్డ్ రోబ్ ఐటమ్స్) వేలం వేయనున్నారు. కాగా,విరాళాల సేకరణకు ఇది సరైన పద్ధతి అని చెప్పిన సోహా.. ఇందులో పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన ప్రయత్నం కూడా ఉందని వెల్లడించింది.
ఈ మేరకు సేకరించిన విరాళాలన్నీ పటౌడీ ట్రస్ట్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా జంతు సంరక్షణ కోసం పనిచేసే ఎన్జీవోలకు అందజేస్తామని తెలిపింది. కాగా, తాము వేలం వేసే దుస్తులు పర్యావరణానికి మేలు చేసేవని.. ఇవి 8,46,527.92 లీటర్ల నీటిని, 2,070.68 కేజీల కార్బన్‌ను సేవ్ చేస్తాయని షర్మిళ ఠాగూర్ చెప్పింది. వీటిల్లో ఆర్మానీస్ నుంచి కాక్‌టెయిల్ దుస్తుల వరకు రకరకాల ఐటమ్స్‌ను వేలం వేయనున్నారు. ఇవి సాల్ట్ స్కౌట్ స్టోర్‌లో లభిస్తాయి. ఈ మేరకు కొనుగోలుదారులు తాము కొనుగోలు చేసిన వస్తువులతో ఎంత మేర కార్బన్‌ను సేవ్ చేస్తున్నారనే విషయాన్ని తెలుసుకోవచ్చు.