ఇంట్లోనే షర్మిల నిరాహార దీక్ష

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసి నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వైఎస్ షర్మిల మూడు రోజులు నిరాహార దీక్ష చేపడుతున్నారు. ఇందిరాపార్క్ దగ్గర నిరాహార దీక్ష చేసేందుకు పోలీసులు ఒక్కరోజు మాత్రమే అనుమతి ఇవ్వడంతో.. మిగతా రెండు రోజుల పాటు లోటస్‌పాండ్‌లోని తన ఇంట్లోనే దీక్ష చేయాలని షర్మిల నిర్ణయించారు. అందులో భాగంగా ఇవాళ రెండవరోజు నిరాహార దీక్షను షర్మిల ఇంట్లోనే చేపడుతున్నారు. నిరాహార దీక్ష నేపథ్యంలో షర్మిల ఆరోగ్య […]

Update: 2021-04-16 05:05 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసి నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వైఎస్ షర్మిల మూడు రోజులు నిరాహార దీక్ష చేపడుతున్నారు. ఇందిరాపార్క్ దగ్గర నిరాహార దీక్ష చేసేందుకు పోలీసులు ఒక్కరోజు మాత్రమే అనుమతి ఇవ్వడంతో.. మిగతా రెండు రోజుల పాటు లోటస్‌పాండ్‌లోని తన ఇంట్లోనే దీక్ష చేయాలని షర్మిల నిర్ణయించారు.

అందులో భాగంగా ఇవాళ రెండవరోజు నిరాహార దీక్షను షర్మిల ఇంట్లోనే చేపడుతున్నారు. నిరాహార దీక్ష నేపథ్యంలో షర్మిల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు ఉదయం వైద్యులు పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. నిరుద్యోగులకు న్యాయం చేయాలని, తెలంగాణ ప్రభుత్వం వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్ జారీ చేసి ఖాళీలను భర్తీ చేయాలని షర్మిల డిమాండ్ చేస్తున్నారు.

కాగా, నిన్న ఇందిరాపార్క్ వద్ద షర్మిల నిరాహార దీక్ష చేపట్టారు. అనుమతి ఇచ్చిన సమయం ముగిసిన తర్వాత కూడా షర్మిల దీక్ష చేస్తుండటంతో.. పోలీసులు దీక్షను భగ్నం చేశారు. దీనికి నిరసనగా షర్మిల లోటస్‌పాండ్‌కు పాదయాత్రగా వెళ్తుండగా.. పోలీసులు అరెస్ట్ చేయడం ఉద్రిక్తతకు దారితీసింది.

Tags:    

Similar News