భావాలను పంచుకుందాం రండి…

మన కళ్ల ముందు అనేకానేక అంశాలు అలా కదలాడుతూ వెళ్లిపోతూ ఉంటాయి. అప్పుడు మన మనసు మనతో మాట్లాడుతుంది. వాటి గురించి ఎన్నో ఊసులు చెబుతుంది. కష్టాలను కలబోసుకుంటుంది. సుఖాల పల్లకినీ మన దరికి చేర్చుతుంది. చేదు గుళికలనూ మింగిస్తుంది, తీయని మధురిమలనూ తోడు తెస్తుంది. చెడును చెండాడమంటుంది. మంచిని బోధించమంటుంది. అబద్ధాన్ని తరిమేయమంటుంది. నిజాలను అక్కున చేర్చుకోమంటుంది. ఆవేశాన్ని అణచుకోమంటుంది. ఉప్పెనలా ఎగిసిపడమనీ చెబుతుంది. ఇలా ఒకటేమిటి ఎన్నెన్నో భావాలను మది కుప్పలుతెప్పలుగా మన ముందుంచుతుంది. […]

Update: 2020-05-16 08:13 GMT

మన కళ్ల ముందు అనేకానేక అంశాలు అలా కదలాడుతూ వెళ్లిపోతూ ఉంటాయి. అప్పుడు మన మనసు మనతో మాట్లాడుతుంది. వాటి గురించి ఎన్నో ఊసులు చెబుతుంది. కష్టాలను కలబోసుకుంటుంది. సుఖాల పల్లకినీ మన దరికి చేర్చుతుంది. చేదు గుళికలనూ మింగిస్తుంది, తీయని మధురిమలనూ తోడు తెస్తుంది. చెడును చెండాడమంటుంది. మంచిని బోధించమంటుంది. అబద్ధాన్ని తరిమేయమంటుంది. నిజాలను అక్కున చేర్చుకోమంటుంది. ఆవేశాన్ని అణచుకోమంటుంది. ఉప్పెనలా ఎగిసిపడమనీ చెబుతుంది. ఇలా ఒకటేమిటి ఎన్నెన్నో భావాలను మది కుప్పలుతెప్పలుగా మన ముందుంచుతుంది. వీటిని మనం మౌనంగా వింటాం. ఇప్పడు వాటిని పలువురితో పంచుకుందాం రండి.

అందుకోసం మీకు ’దిశ‘ దిన పత్రిక ఒక వేదికను ఏర్పాటు చేస్తోంది. సోషల్ మీడియాకు దీటుగా అభిప్రాయాలను ఎప్పటికప్పుడు తాజాగా పాఠకులకు అందించేందుకు ‘ఒపీనియన్ పేజీ’ని ప్రారంభిస్తోంది. విశ్వసనీయత ‘దిశ’ మీడియా ప్రత్యేకత. వాస్తవం వైపు పయనం మా నినాదం. ప్రజా సమస్యలు, సమకాలీన అంశాలు, ప్రభుత్వ విధానాలూ, రాజకీయ, సామాజిక, ఆర్థిక, వ్యవసాయిక విషయాల మీద మీరు స్పందించవచ్చు. ఇంకెందుకు ఆలస్యం… మీ భావాలను ఒక వాట్సాప్ పోస్టు ద్వారా మాకు పంపించండి. లేదా dishaopinion@gmail.com కు మెయిల్ చేయండి. వ్యాసాలు సంక్షిప్తంగా ఉంటేనే బాగుంటాయనే సంగతి మీకు తెలిసిందేగా… మీ ఫొటో జోడించడం మరిచిపోకండి. కొత్త, పాత రచయితలందరికీ ఇదే మా ఆహ్వానం…మా వాట్సాప్ నంబర్ 9010223917

Tags:    

Similar News